ఘోర ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వీడియో!
బీఎండబ్ల్యూ 3 సిరీస్ మోడల్ కారు: ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం సహా రోడ్లమీదకు అకస్మాత్తుగా పశువులు రావడం వంటి కారణాలున్నాయి. తాజాగా అతివేగం కారణంగా ఓ భారీ ప్రమాదం జరిగింది. అనుమతించిన దాని కంటే వేగంగా ప్రయాణిస్తే ఎంత ప్రమాదమో ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది.
తాజా ఘటనలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ లగ్జరీ కారు రోడ్డు పక్కనున్న మెటల్ బార్ (ఇనుప కడ్డీ)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రమాద ధాటికి కారులోపలి నుంచి మెటల్ బార్ చొచ్చుకుపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కారును చీల్చుకుంటూ..: భారత్ మార్కెట్‌లో వేగంగా ప్రయాణించగల వాహనాల్లో బీఎండబ్ల్యూ 3 సిరీస్ మోడల్ కారు ఒకటి. ప్రస్తుతం ఈ కారు ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి, అదుపు తప్పింది. అనంతరం రోడ్డు పక్కనున్న మెటల్ బార్ (ఇనుప కడ్డీ)ను ఢీకొట్టింది. కారు లోపలి నుంచి మెటల్ బార్ చొచ్చుకుపోయింది.
డ్రైవర్ ఒక్కరే : ఈ ప్రమాదంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎక్కుడ, ఎప్పుడు జరిగిందనే కచ్చితమైన సమాచారం తెలియలేదు. కానీ 8 లేన్ల జాతీయ రహదారిపైన జరిగినట్లు తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారు గంటకు 250 కి.మి వేగంతో ప్రయాణం చేయగలదు. దాంతోపాటు కేవలం 4.4 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ ప్రమాద వీడియోను గమనిస్తే.. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ అత్యంత వేగం సహా పూర్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి కారు భారీగా డ్యామేజీ అయింది. ఇంజిన్, బంపర్, విండ్‌షీల్డ్, క్యాబిన్, రూఫ్ సహా కారులోని అనేక భాగాలు దెబ్బతిన్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మరణం తర్వాత NHAI అధికారులు జాతీయ రహదారులపైన ప్రమాదకర మలుపు సహా ఇతర ప్రాంతాల్లో మెటల్ బార్‌ల ఏర్పాటుపై దృష్టిపెట్టారు. దాంతోపాటు రహదారులపై మలుపులు, వంతెనలు, ఆ రోడ్డుపై స్పీడ్ లిమిడ్ సహా ఇతర వివరాలను ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి.

హెచ్చరిక బోర్డులు: అయితే చాలా మంది వాహనదారులు ఈ హెచ్చరిక బోర్డులను గమనించకుండానే డ్రైవింగ్ చేస్తుంటారు. ఫలితంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల సంస్థ అధికారులు, పోలీసులు సహా ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నా.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








