Hyd వరదలో చిక్కుకున్న BMW కారు.. రిపేర్‌కు అక్షరాలా రూ. 40 లక్షలు!!
వర్షాకాలం మొదలైందంటే చాలు రోడ్లపై వాహనదారుల తిప్పలు అంతా ఇంతా కావు. భారీ వానలకు పార్కింగ్ విషయంలో కూడా వాహనదారులకు అవస్థలు తప్పవు. తాజాగా హైదరాబాద్‌లో రోడ్డుపై బీఎండబ్ల్యూ కారు పార్క్ చేయడంతో దాని మరమ్మతులకు రూ. లక్షల్లో బిల్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
దేశంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నైలలో వర్షాకాలం వస్తే చాలు.. వరుణుడి బీభత్సానికి లోతట్టు ప్రాంతాలు, ఇళ్లలోకి నీరు చేరి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చాలదన్నట్లు సరైన ప్రణాళిక లేని రోడ్డు పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో బీఎండబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ ముందు కదలలేదు. గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో టోయింగ్ వాహనం సహాయంతో కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కారు మరమ్మతు పనులకు సంబంధించి బిల్లు వేస్తే సుమారు రూ.40 లక్షలు చూపించింది.
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉదయ్ తేజ అనే వ్యక్తి తన బీఎమ్‌డబ్ల్యూ జీ 30 - 5 సిరీస్ కారును హైదరాబాద్ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో పార్క్ చేశారు. గర్భవతి అయిన తన భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఇంతలో భారీ వర్షం కురిసి కారు నీటిలో మునిగిపోయింది. కారులోకి నీరు చేరడంతో ఆగిపోయింది.

హైదరాబాద్ మహా నగరంలో ప్రతి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు సర్వసాధారణం. రాత్రి కురిసిన కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లపై 12 బీఎండబ్ల్యూలు, 8 మెర్సిడెస్ బెంజ్ కార్లు నిలిచిపోయాయని ఉదయ్ తేజ తెలిపారు. సంబంధిత అధికారులు రోడ్డు పక్కన డ్రెయిన్ నిర్మించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
బీఎండబ్ల్యూ యజమాని ఉదయ్ తేజ గంటల తరబడి నిరీక్షించినా కారు కదలకపోవడంతో కారును టోయింగ్ వాహనంలో సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కారులో ప్రధాన భాగాలు దెబ్బతినడంతో అక్కడి సిబ్బంది మరమ్మతులకు రూ.40 లక్షలు అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉదయ్ వాడుతున్న బీఎమ్‌డబ్ల్యూ జీ 30 5-సిరీస్ కారు ధర రూ.65 లక్షలుగా ఉంది. ఈ విషయాన్ని ఉదయ్ తేజ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

ఈ కారు మరమ్మతులకు వెచ్చించే డబ్బుతో కొత్త బీఎమ్‌డబ్ల్యూ ఎంట్రీ లెవల్ కారు లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, కారు యజమానితో పాటు కార్పొరేషన్ వారిది తప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. నగరంలో జనాభా పెరిగే కొద్దీ వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు మున్సిపల్ అధికారులు తగు ఏర్పాట్లు చేయాలి. అది ఇక్కడ కొరవడినట్లుగా కనిపిస్తోంది.
భారత్‌లో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఏ సమయంలో ఏ మేరకు వర్షం కురుస్తుందో చెప్పలేం. కాబట్టి కార్లను రోడ్డు పక్కన పార్క్ చేయకుండా సురక్షిత ప్రాంతంలో పార్క్ చేయాల్సిన బాధ్యత యజమానిపై ఉంది. ఇక్కడ ఉదయ్ తేజ రోడ్డుపై పార్క్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు వెళ్లాలి అనుకున్న ప్రదేశంలో సరైన పార్కింగ్ లేనప్పుడు ప్రజా రవాణా లేదా క్యాబ్‌ను ఉపయోగించడం ఉత్తమ ఎంపిక.


Click it and Unblock the Notifications








