BMW కారుపై పశువుల మేత రవాణా.. వీడియో వైరల్‌

ప్రస్తుతం ఓ BMW కారు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో బీఎండబ్ల్యూ కారుతో పశువులకు మేత తీసుకెళ్తున్న దృశ్యాలను గమనించవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్నది ఎవరు. ఈ కారు ఎంత ధర ఉంటుందనే చర్చ నడుస్తోంది.

బిహార్‌కు చెందిన అన్సు కుమార్‌ వ్యవసాయం సహా టూర్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ కూడా ఉందని సమాచారం. రెండు రోజుల క్రితం అన్సుకుమార్.. తన బీఎండబ్ల్యూ కారులో ఆవులకు మేత కోసం పశుగ్రాసం తీసుకువచ్చారు. దీంతో ఆశ్యర్యపోయిన కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

BMW 5 series car carried fodder

ఈ వీడియోలో ఉన్నది BMW 5 సిరీస్‌ లగ్జరీ సెడాన్ కారు. అయితే ఈ కారుకు నంబర్‌ ప్లేట్‌ లేదు. అయితే కారు కచ్చితంగా ఏ మోడల్‌ అనేది తెలియలేదు. అయితే బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ కారు ప్రారంభ ధర రూ.65 లక్షలకు పైగా ఉంది. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది.

బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ కారు 1995cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 4000 rpm వద్ద 190bhp శక్తి, 1750 rpm వద్ద 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు డీజిల్‌ ఇంజిన్‌ 17.42 kmpl మైలేజీ ఇస్తుంది.

BMW 5 series car carried fodder

కారు 4963mm పొడవు, 2126mm వెడల్పు, 1497mm ఎత్తును కలిగి ఉంటుంది. 2975mm వీల్‌బేల్‌ను కలిగి ఉంటుంది. 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. భద్రత పరంగా ఈ కారు యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌, బ్రేక్‌ అసిస్ట్‌, చైల్డ్‌ సేఫ్టీ లాక్‌, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌ బెల్ట్ వార్నింగ్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, టైర్‌ ప్రజర్‌ మేనేజ్‌మెంట్‌, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, EBD, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ ఫీచర్లు ఉన్నాయి.

దీంతోపాటు కార్నింగ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ఇంపాక్ట్‌ సెన్సింగ్‌ ఆటో డోర్‌ ఆటోలాక్‌, 360 డిగ్రీల కెమెరా, స్పీడ్‌ అలెర్ట్‌, ట్రిపాయింగ్‌ ఎయిర్‌బ్యాగ్‌ సీట్లు సహా అనేక భద్రతా ఫీచర్లను బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ కార్లు కలిగి ఉంటాయి.

BMW 5 series car carried fodder

దీంతోపాటు బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ కారు ఇంటీరియర్‌ 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సపోర్టు చేస్తుంది. 16 స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 2DIN ఆడియో, వైర్‌లైస్ ఫోన్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 9, 2023, 18:51 [IST]
English summary
Bmw 5 series car to carried fodder for cow video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+