Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News కేసీఆర్‌కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఒక బిఎండబ్ల్యు అభిమాని. అంతే కాకుండా అతని వద్ద ఉన్న చాలా కార్లు చాలా వరకు బిఎండబ్ల్యు లోగోను కలిగి ఉంటాయి. సాధారణంగా సెలబ్రెటీస్ ఎక్కువగా లగ్జరీ వాహనాల్లో మాత్రమే తిరుగుతారు. మార్కెట్లోకి వచ్చే కార్లను కొనుగోలు చేస్తూఉంటారు . ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను చేర్చడానికి పాతవాటిని అమ్మకానికి పెడుతూ ఉంటారు.
షారుఖ్ ఖాన్ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ను కలిగి ఉండేవాడు. దీనిని కొంతకాలం క్రితం విక్రయించాడు. ఈ కారు ప్రస్తుతం దాని రెండవ యజమాని వద్ద ఉంది మరియు ఇది మళ్ళీ అమ్మకానికి వచ్చింది.
ఇది 2010 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, ఇది మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ కారు ప్రస్తుతం దాని రెండవ యజమాని వద్ద ఉంది. ఇది "555" రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉంది. షారుఖ్ ఖాన్ ఈ కారుతో గతంలో చాలాసార్లు కనిపించాడు. షారుఖ్ ఖాన్ యొక్క 555 నంబర్ అతని సిగ్నేచర్ నెంబర్ అని గమనించాలి. అతని ఇతర వాహనాలు కూడా అదే రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉంటాయి.
MOST READ:కార్ దొంగతనాలను నివారించడానికి కొత్త ఐడియా, ఏంటో తెలుసా !
ఈ కారు ఇప్పటికి 10 సంవత్సరాల ముందు కొనుగోలు చేశారు. దీని ధర ఇప్పుడు 24 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర నిజంగా చాలా సరసమైనదనే చెప్పాలి. ఈ కారు యొక్క ఓడోమీటర్ రీడింగ్, భీమా కవరేజ్ మరియు ఇతర సమాచారం వంటి వివరాలను విక్రేత పేర్కొనలేదు.
దీని గురించి మీరు మరిన్ని వివరాల కోసం విక్రేతతో ఎప్పుడయినా సంప్రదించవచ్చు. ఇంటర్నెట్లో వాహనం యొక్క వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా కొత్త కొనుగోలుదారు రిజిస్ట్రేషన్ మరియు యాజమాన్యాన్ని బదిలీ చేయవచ్చు.
MOST READ:టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ - ఆకర్షనీయమైన రేసింగ్ యల్లో కలర్లో
బిఎండబ్ల్యూ కార్ భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖుల యొక్క మొదటి ఎంపిక. ఇది అగ్రశ్రేణి లక్షణాలతో అత్యంత విలాసవంతమైన క్యాబిన్‌ను అందిస్తుంది. ఈ 7 సిరీస్ 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ. ఇది మంచి ఫీచర్స్ కలిగి ఉంది.
ఈ బిఎండబ్ల్యూ 3.0-లీటర్ వి 6 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంజిన్ గరిష్టంగా 326 Bhp శక్తిని మరియు 450 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కొత్త కొత్త మోడళ్లతో భర్తీ చేయబడింది. ఈ కార్ ముందు భాగంలో M-పవర్ కలర్స్ చూపించే డెకాల్స్ ఉన్నాయి.
MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి
ఈ బిఎమ్‌డబ్ల్యూకి పదేళ్ల వయస్సు ఉన్నప్పటికీ, ఈ వాహనాలు జీవితకాలం కొనసాగేలా నిర్మించబడ్డాయి. ఏదేమైనా, ధర పరిధిలోని ఏ ఇతర కారుతో పోల్చినప్పుడు నిర్వహణ చాలా ఖరీదైనదని గమనించాలి. చాలా భాగాలు దిగుమతి అయినందున, కారు మరమ్మతు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మరింత సమాచారం మరియు వివరాల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా విక్రేతను నేరుగా సంప్రదించండి.