Viral video ఇదేం విచిత్రం.. నడిరోడ్డుపై క్షణాల్లో రంగులు మారుతున్న కారు..!

కార్ల తయారీ సంస్థలు మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొనేందుకు మరియు కస్టమర్లను ఆకట్టుకొనేందుకు రకరకాల ఫీచర్లను ఆవిష్కరిస్తుంటాయి. మెరుగైన సేఫ్టీతోపాటు ఫీచర్లు ఉన్న వాహనాలను వినియోగదారులు కోరుకుంటున్న నేపథ్యంలో అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఆకట్టుకొనే ఫీచర్లను విడుదల చేస్తున్నాయి.

తాజాగా బీఎండబ్ల్యూ కారుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ పబ్లిక్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు సెకన్ల వ్యవధినే ఆటోమేటిక్‌గా రంగులు మారడం ఈ వీడియోలో గమనించవచ్చు. తెల్లని రంగు బీఎండబ్ల్యూ కారు క్షణాల్లోనే బూడిత రంగులోకి మారిపోతుంది.

bmw iX flow feature

అయితే ఈ వీడియో ఎక్కడ రికార్డు చేశారో తెలియకపోయినప్పటికీ... వేలాది మంది వీక్షణలను (views) కలిగి ఉంది. కారు క్షణాల్లో రంగులు మారేందుకు కారణం ఏంటి, బీఎండబ్ల్యూ ఏమైనా కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిందా... ఒక్కసారిగా కారు మొత్తం రంగు ఎలా మారుతుంది అనే సందేహం వచ్చిన వారు ఈ స్టోరీలోకి వెళ్లండి.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ రంగుల మారడం వెనుక ఉన్న అసలు ఫీచర్‌ iX ఫ్లో. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఈ ఫీచర్‌ను బీఎండబ్ల్యూ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కస్టమర్‌ అభిరుచికి అనుగుణంగా రంగులు మార్చుకోవచ్చు. ప్రస్తుతం తెలుపు, నలుపు, బూడిత రంగులు రంగుల్లోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

bmw iX flow feature

అయితే వీడియో కనిపిస్తున్న కారు ఇదే ఫీచర్‌ కలిగి ఉందా లేదా అనే అంశంపై బీఎండబ్ల్యూ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే కారు రంగులు మార్చడానికి ఎలక్ట్రోఫోరేటిక్ ఫిల్మ్‌తో పూత పూయాలి. ఈ ఫిల్మ్‌లో మైక్రో క్యాప్సుల్స్ ఉంటాయి. ఇచ్చిన కమాండ్‌కు అనుగుణంగా క్యాప్సుల్స్‌ రంగులు మారుస్తాయి. ఒక్కో క్యాప్సుల్‌ రంగు మారుతున్న కొద్దీ వాహనం మొత్తం రంగు మారుతున్నట్లు కనిపిస్తుంది.

రంగులు మారుతున్న బీఎండబ్ల్యూ కారుకు సంబంధించిన వీడియోను ఐదు రోజుల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటి వరకు సుమారు 69 వేలకుపైగా నెటిజన్లు లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫీచర్‌ను అన్ని కార్లలోనూ అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం ఈ iX ఫ్లో ఫీచర్‌లో మరిన్ని రంగులు చేర్చాలని కోరుతున్నారు.

పోలీసులకు ఈ ఫీచర్‌ నచ్చకపోవచ్చని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ఈ ఫీచర్‌ కారణంగా క్రైమ్ రేట్‌ పెరుగుతుందని మరో ఇన్‌స్టా యాజర్‌ కామెంట్‌ చేశాడు. ఒక్క స్క్రాచ్‌తో ఈ ఫీచర్‌ పనిచేయడం మానేస్తుందని మరొకరు పేర్కొన్నారు. చిన్న ప్రమాదం జరిగితే ఎంత ఖర్చు అవుతుందో అంటూ మరొకరు రాసుకొచ్చారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 13, 2023, 18:28 [IST]
English summary
Bmw car changing its colour due to ix flow feature video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+