ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంలో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సగటున 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన దీనికి ప్రధాన కారణం. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చింది.

ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

కొత్త మోటారు వాహన చట్టం 2019 సెప్టెంబర్ 1 నుండి భారతదేశంలో అమలు చేయబడింది. కొత్త నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు భారీ జరిమానా విధించబడుతుంది. ఈ భారీ జరిమానాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి.

ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

భారీ జరిమానాలు ఉన్నప్పటికీ, కొంతమంది రైడర్స్ ఇప్పటికీ నియమాలను పాటించడం లేదు. దాదాపు అన్ని వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.

MOST READ:మలేషియా పోలీస్ ఫోర్స్‌లో చేరిన హోండా సివిక్ కార్లు

ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారు యజమాని రూ. 83 లక్షల ఖరీదైన కారు కలిగి ఉన్న అతను కూడా జరిమానా చెల్లించాల్సి వచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వైరల్ అవుతోంది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారును ఆపారు. పోలీసులు కారును ఆపినప్పటికీ, కారులో ఉన్న వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు.

ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

అతనిని పోలీసులు ప్రశ్నించి చివరికి ఆ వ్యక్తి కారులోంచి దిగి ఒక పోలీసు అధికారితో మాట్లాడాడు. పోలీసు అధికారి మోడల్ మరియు కారు ధర గురించి ఆరా తీశారు. కారు ధర రూ . 83 లక్షలు అని చెప్పారు.

MOST READ:సనంద్ ప్లాంట్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన మాక్క్సిస్ ఇండియా

ఆ పోలీసు అధికారికి ఆ కారు మోనాల్ కి రూ. 5 వేలు జరిమానా విధించారు. అతడు ఈ 5000 జరిమానాతో నుంచి 100 లేదా 200 రూపాయలు తగ్గించమని పోలీసులను అభ్యర్థించాడు. కానీ పోలీసులు ఒప్పుకోలేదు.

ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

చివరికి అతడు జరిమానా చెల్లించిన తరువాత ముందుకు వెళ్ళాడు. ఈ వీడియోను భగవత్ ప్రసాద్ పాండే తారకో జీ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్‌లో మాట్లాడటం చాలా ప్రమాదకరం. దీనివల్ల వివిధ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. దీని వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాహనదారులు తప్పని సరిగా రోడ్డు నియమాలను పాటించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు.

Image Courtesy: Bhagwat Prasad Pandey Daroga Ji

MOST READ:కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్

Most Read Articles

English summary
BMW car owner fined Rs 5000 for talking on phone and driving. Read in Telugu.
Story first published: Friday, June 12, 2020, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X