నేటి వీడియో: పార్కింగ్ లాట్ పైభాగంలో స్టన్నింగ్ డ్రిఫ్టింగ్
కార్ డ్రిఫ్టింగ్ ఓ కళ, ఎంతో నైపుణ్యం, శిక్షణ, ఏకాగ్రత ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. కారును డ్రిఫ్ట్ చేసేందుకు మంచి బ్రేకులు కలిగిన కారుతో పాటు, కాస్తంత గుండె ధైర్యం కూడా కావాలి. కార్ డ్రిఫ్టింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, రోడ్లపై టైర్లు అరిగేలా కారును గిరికీలు కొట్టించడమే.
ఒకప్పుడు టైమ్‌పాస్‌గా ఉన్న ఈ కళ, ఇప్పుడు అనేక దేశాల్లో స్పోర్టింగ్ ఈవెంట్‌గా మారిపోయింది. డ్రిఫ్టింగ్ కాన్సెప్ట్ మీద అనేక మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనేక హాలీవుడ్ సినిమాల్లో కూడా కార్లతో డ్రిఫ్టింగ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి.
ఉదాహరణకు, 2006లో వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టోక్యో డ్రిఫ్ట్ చిత్రంలో ఓ అండర్‌గ్రౌండ్ రేసర్ నిస్సాన్ 350జెడ్ కారుతో బహుళ అంతస్థుల పార్కింగ్ భవనంలో చేసే డ్రిఫ్టింగ్ సన్నివేశం రోమాంఛనీయంగా ఉంటుంది. అలాంటి, ఓ డ్రిఫ్టింగ్ వీడియోనే మనం ఈ వీడియోలో వీక్షిద్దాం రండి.
నోబెర్‌ఫిల్మ్స్ 'ది అగ్లీ డక్లింగ్' అనే పేరుతో చిత్రీకరించిన ఓ లఘు చిత్రంలో బిఎమ్‌డబ్ల్యూ 325ఐ కారుతో ఓ డ్రిఫ్టర్ చేసే సన్నివేశం చూపరులను అబ్బురపరుస్తుంది. మరి మనం కూడా ఆ వీడియోని వీక్షిద్దాం రండి..! వీడియో కోసం క్రింది ఫొటోపై కానీ లేదా ఈ లింక్‌పై కానీ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









