బిజీ రోడ్డులో ఖరీదైన బైక్‌పై యువకుడి విన్యాసాలు.. బైక్‌ను గాల్లోకి లేపిన కాసేపటికే.. వైరల్ వీడియో.!!
భారత్‌లో రోడ్లపై నిర్లక్ష్య డ్రైవింగ్ సర్వసాధారణమైపోయింది. రోడ్లు రద్దీగా ఉన్నా.. ఖాళీగా ఉన్నా కొందరు ఆకతాయిలు తమ కార్లు, బైక్‌లతో విన్యాసాలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి నెట్టింట్లో(Biker Reckless Driving) వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బీఎండబ్ల్యూ G 310 RR బైక్‌ను(BMW G310 RR) నిర్లక్ష్యంగా నడుపుతున్న ఓ యువకుడు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న టయోటా ఫార్చ్యూనర్‌ను ఢీకొట్టడాన్ని చూడవచ్చు. ఆ సమయంలో ఓ రైడర్ హెల్మెట్ కెమెరాలో యాక్సిడెంట్ విజువల్స్ రికార్డయ్యాయి. బిజీగా ఉన్న రోడ్డుపై BMW G310 RR బైకర్ గందరగోళంగా నడుపుతున్నాడు.

మధ్యమధ్యలో సడెన్ బ్రేక్‌లు వేయడం, బైక్ వెనుక భాగాన్ని పైకి లేపడం లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇదే మార్గంలో అతని ముందు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వెళ్తోంది. రైడర్ బైక్ బ్రేకు చాలా గట్టిగా నొక్కడంతో పాటు వెనుక భాగం మరింత పైకి లేచి వెనుక భాగం గాలిలో లేవడంతో బైక్ రైడర్ అదుపు తప్పడంతో బీఎండబ్ల్యూ G310 RR పక్కకు వెళ్లిపోయింది.
ఆ సమయంలో బీఎండబ్ల్యూ రైడర్ మళ్లీ అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా.. నేరుగా ముందుకు టయోటా ఫార్చ్యూనర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైకర్ ఒక్కసారిగా కింద పడి రోడ్డు మధ్యలోకి దూసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో అటువైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఓ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.

అతను లేచి నిలబడి బైక్‌ని రోడ్డుకి ఒకవైపుకి మార్చేసరికి, తన రైడింగ్ స్నేహితులు కూడా వచ్చారు. ఇక్కడ అతనితో పాటు మరికొందరు కూడా తమ బైక్‌లపై స్టంట్లకు పాల్పడ్డారు. అయితే టయోటా ఫార్చ్యూనర్ డ్రైవర్ బైకర్ల పక్కనే కారు ఆపాడు. అదే మార్గంలో వెళ్తున్న హోండా సిటీ కారుకు కూడా ఢీకొట్టుకుని గాయాలు కావడంతో.. అతను కూడా పక్కనే కారును ఆపాడు.
బైకర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో వారితో కారు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఫార్చ్యూనర్ డ్రైవర్ రోడ్డు మధ్యలో ఆపడమే ప్రమాదానికి కారణమని ద్విచక్ర వాహనదారులు ఆరోపించారు. అయితే ఆ తప్పు పూర్తిగా బైక్ రైడర్‌దేనని వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఫార్చ్యూనర్ డ్రైవర్ మరియు హోండా సిటీ డ్రైవర్‌తో చాలాసేపు వాగ్వాదం తర్వాత, బైకర్లు పరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నారు.

హోండా సిటీ డోర్‌పై బైక్‌ను ఢీకొట్టినందుకు సుమారు రూ.3 వేలు, ఫార్చ్యూనర్ టైరు పంక్చర్ అయినందుకు రూ.2 వేలు పరిహారం బైకర్లు చెల్లించారు. ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా బైకర్ తన ప్రాణాలతోనే కాకుండా రోడ్డుపై ఇతరుల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. ఇది మంచిది కాదని గమనించాలి.
రైడింగ్ ఔత్సాహికులు స్టంట్స్ చేయాలి అనుకుంటే ప్రైవేట్ స్థలం లేదా ఏదైనా క్లోజ్‌డ్ సర్క్యూట్‌ను ఎంచుకోవాలి. అలాంటి చోట మాత్రమే ఇలాంటి విన్యాసాలు చేయాలి. పబ్లిక్ రోడ్లపై ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఇతర వాహనదారులను క్షేమంగా ముందుకు పోనివ్వాలి.

ఇక బీఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్‌ఆర్ బైక్ ఇంజిన్‌ను పరిశీలిస్తే.. ఇది 313 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్ 9,500 rpm వద్ద 33.5 bhp శక్తిని మరియు 7,700 rpm వద్ద 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఈ బైక్ ఇంజిన్ నాలుగు రైడింగ్ మోడ్‌లు.. ట్రాక్, అర్బన్, రైన్ & స్పోర్ట్‌లతో వస్తుంది. కనెక్టివిటీ ఫంక్షన్‌లు, రైడ్-బై-వైర్ థ్రోటిల్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 5.0-అంగుళాల స్మార్ట్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ వెర్షన్ ధర రూ. 2.90 లక్షలు, స్టైల్ స్పోర్ట్ వెర్షన్ ధర రూ. 2.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








