డబ్బులు లేక సెంకడ్ హ్యాండ్ బిఎమ్‌డబ్ల్యూ కారు కొన్నా: సచిన్
క్రికెట్ గాడ్‌గా పిలిచే మన సచిన్ టెండూల్కర్‌కి బిఎమ్‌డబ్ల్యూ కార్లంటే మహా క్రేజ్. 14 ఏళ్ల వయస్సు నుంచే ఓ బిఎమ్‌డబ్ల్యూ కారును సొంతం చేసుకొవాలనే అభిలాషతో ఉండేవాడినని, అప్పట్లో తన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్న కారణంగా, సెకండ్ హ్యాండ్ బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేశానని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
ఈరోజు ముంబైలో జరిగిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ విడుదల సందర్భంగా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సచిన్ టెండూల్కర్ ఈ విషయాలను వెల్లడించాడు. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా హెడ్ ఆండ్రియా స్కాఫ్ డీజిల్ వెర్షన్ 3 సిరీస్ సెడాన్‌ను విడుదల చేయగా, సచిన్ టెండూల్కర్ స్పోర్ట్ లైన్ పెట్రోల్ వెర్షన్ 3 సిరీస్ సెడాన్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కు తాను ఓ పెద్ద అభిమానిని అని, 1993లో తన వద్ద డబ్బులు తక్కువగా ఉన్న కారణంగా ఓ సెకండ్ హ్యాండ్ బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు. కాగా.. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సెడాన్‌ను డ్రైవ్ చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు.
లండన్‌లోని ఓ రేస్ ట్రాక్‌పై సచిన్ టెండూల్కర్ ఈ కారును డ్రైవ్ చేశారు. ఈ కొత్త కారు గురించి తన అనుభవాన్ని మీడియాతో పంచుకుంటూ సచిన్ ఇలా చెప్పుకొచ్చాడు.. ఈ 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సెడాన్ యాక్సిలరేషన్, హ్యాండ్లింగ్, బ్రేకింగ్, కంఫర్ట్, సేఫ్టీ వంటి అన్ని ముఖ్యమైన అంశాల్లో ఉత్తమంగా ఉంటుందని తెలిపాడు. ఈ కార్యక్రమం ముగించే సమయంలో ఆండ్రియాస్ స్కాఫ్ ప్రసంగిస్తూ.. సచిన్ టెండూల్కర్ వద్ద ఎప్పుడూ ఎక్కువ డబ్బులు ఉండాలని, మరిన్ని బిఎమ్‌డబ్ల్యూ కార్లను (ఫస్ట్ హ్యాండ్ కార్లను) కొనుగోలు చేయాలని చలోక్తి విసిరారు.
అయితే, సచిన్ టెండూల్కర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కాగా.. సచిన్ టెండూల్కర్ ఇటీవలే సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును కూడా డ్రైవ్ చేసినట్లు బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది. ఇక్క కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు విషయానికి వస్తే.. కేవలం రూ. 28.90 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ 6వ తరం (సిక్స్త్ జనరేషన్) బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ మునుపటి వెర్షన్ కన్నా ఎంతో మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








