వేలానికి అత్యంత అరుదైన బియమ్‌డబ్ల్యూ యమ్1 మోడల్ కారు
సాధారణంగా పురాతన వస్తువులను వేలం ద్వారా అమ్మడం చూసుంటా. కాని బియమ్‌డబ్ల్యూ కి చెందిన అత్యంత అరుదైన యమ్1 మోడల్ కారును న్యూయార్క్‌లో డిసెంబర్ 10 వ తేదిన వేలం వేయనున్నారు. మరి మీరు కూడా పాల్గొంటారా?
పాల్గొనె ముందు దీని ధర,ఇందులో ఉన్న ఇంజన్ కండీషన్ వంటి ఇతర వివరాలను చూసుకుని వెల్లండి.వేలం పాట ద్వారా దీనిని అమ్మాలనుకున్నారు. మరి ఇందులో ఉన్న విశేషాలు ఎంటో ఒక సారి చూద్దాం రండి.

దీనిని RM Sotheby's వారు డ్రివెన్ బై డిస్రప్శన్ ఆధ్వర్యంలో ఈ కారును వేలం వేయనున్నారు.

ఈ బియమ్‌డబ్ల్యూ యమ్1 మోడల్ కారును దాదాపుగా 800,000 నుండి 1,000,000 మధ్య అమెరికన్ డాలర్ల కు విక్రయించనున్నట్లు తెలిపారు.

దీనిని 1999 లో జియోర్‌గెట్టొ గిజియారొ అనే డిజైనర్ దీనిని తయారు చేశాడు. మరియు దీని చాసి పూర్తిగా ఇటలీ వారి స్టైల్‌లో తయారు చేశారు.

కొన్ని ఇతర పరికరాలు ల్యాంబోర్గిని మరియు కౌంటాక్ వంటి సంస్థలకు చెందన కార్ల నుండి గ్రహించి ఇందులో వాడారు.

ఇందులో 3,453 సీసీ గల ఆరు సిలిండర్ల ఇన్ లైన్ ఇంజన కలదు. ఇది దాదాపుగా 277 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజన్ కారు మధ్య భాగంలో అమర్చినట్లు తెలిసింది.

ఇందులో ఉత్పత్తి అయ్యే మొత్తం పవర్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెనుక చక్రాలకు పవర్‌ను అందిస్తోంది.

ఈ బియమ్‌డబ్ల్యూ యమ్1 కారు ఆర్కిటిక్ వైట్ కలర్‌లో ఉంటుంది. తరువాత దీని ఛాసిస్ నంబర్-4301426

ఈ బియమ్‌డబ్ల్యూ వైట్ కలర్ కారు కేవలం 628 కిలో మీటర్లు మాత్రమే తిరిగింది. అందుకే కాబోలు దీనిని అరుదైన కారు అన్నారు.



Click it and Unblock the Notifications








