కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాలా వార్తలు మనల్ని ఆశ్చర్యాన్ని మరియు ఒకింత అనుమానాలను కలిగిస్తాయి. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు మళ్ళీ తెరమీదికి వచ్చింది. ఈ సంఘటనలో దాదాపు రూ. 1 కోటి రూపాయలకంటే ఎక్కువ ఖరీదైన బిఎండబ్ల్యు (BMW) నదిలో దొరికింది. ఇంతకీ దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం రండి.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

నివేదికల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా శ్రీరంగపట్నం నిమిషాంబ ఆలయం సమీపంలోని కావేరీ నదిలో బీఎండబ్ల్యూ కారు లభ్యమైంది. గత గురువారం ఈ విషయాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. గుర్తించిన వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారుల సాయంతో కారును వెలికి తీసేందుకు ప్రయత్నించారు.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

ముందుగా కారులో ఎవరైనా చిక్కుకుపోయారా అని పోలీసులు గాలించారు, అయిత్ ఆ కారులో ఎవరు లేరని తెలిసింది. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కారు ఎవరిది అని ఆరా తీయగా బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతానికి చెందిన రూపేశ్​కి సంబంధించిన కార్ అని విచారణలో తెలిసింది.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

అయితే ఈ పని చేయడానికి కారణం ఏమి అని అతన్ని పోలీసులు ప్రశ్నించగా సరైన సమాచారం రాలేదు. అయితే అంతటితో ఆగకుండా కారు యజమాని బంధువులను విచారించినప్పుడు, అతని తల్లి ఇటీవల మరణించినట్లు తేలింది.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

ఈ సంఘటన అతనికి తీవ్ర మానసిక వేదన కలిగించింది. అప్పటినుంచి అతడి మానసిక పరిస్థితి బాగోలేదఐ తెలిపారు. ఈ క్రమంలోనే ఆతడు ఆ కారుని నదిలో తోసేసినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

అయితే ఈ ఘటనపైనా ఎవరూ కేసు పెట్టకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే ఆ కారు యజమానిని నిర్దోషిగా విడుదల చేసినట్లు తెలుస్తుంది. నదిలో లభించిన కారు బిఎండబ్ల్యు కంపెనీ యొక్క 'ఎక్స్6' (X6) గుర్తించబడింది. దీని ధర రూ. 1.30 కోట్ల వరకు ఉంటుంది. ఇది భారత మార్కెట్లోకి కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి చేయబడుతుంది.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

BMW X6 అనేది కంపెనీ యొక్క అధునాతన ఫీచర్స్ కలిగిన సెడాన్ కారు. ఇది మార్కెట్లో కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 3.0-లీటర్ ఇన్‌లైన్-6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

ఈ ఇంజన్ 340 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. X6 కేవలం 5.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కొలిమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అయితే దీని గరిష్ట వేగం 250 కిమీ/గం.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

BMW X6 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితోపాటు 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 2.5 జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ముందు వరుసలో హీటెడ్ & కూల్డ్ కప్ హోల్డర్‌లు, రెండవ వరుసలో UBS C-టైప్ కనెక్టివిటీ మరియు సిగ్నెల్ కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.

కావేరి నదిలో చిక్కిన ఖరీదైన కారు.. ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?

ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌, ఏబీఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్‌మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుకు చాలా భద్రతను కల్పిస్తాయి.

తన తల్లి మరణానంతరం రూపేష్ మానసిక పరిస్థితి చూసి చాలా మంది కలత చెందుతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం.కొత్త కార్లు మరియు బైకుల గురించి మాత్రమే కాకుండా ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఎప్పటికప్పుడు మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Source: TOI

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2022, 9:36 [IST]
English summary
Bmw owner dumped car in cauvery river karnataka details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+