Live Video BMW బైక్‌ రైడర్‌ సాహసం.. ఒక్క సెకన్‌లోనే బైక్‌ కంట్రోల్‌.. లేకుంటే..!

సాధారణంగా రోడ్లపై బైక్‌ రైడింగ్‌లో ఉన్నప్పుడు చాలా రకాలైన సమస్యలు ఎదురవుతాయి. అందులో అకస్మాత్తుగా రోడ్లపైకి పశువులు, కుక్కలు వస్తాయి. కొన్ని బైక్‌ల వెంటబడతాయి. కుక్కల బారి నుంచి తప్పించుకొనేందుకు బైక్‌ రైడర్లు వేగంగా వెళ్తారు. ఫలితంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. భారత్‌లో రోడ్డ ప్రమాదాలు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణం.

అయితే తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ బైకర్‌ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన రోడ్డుపైనున్న ఓ వాహనంలోని 360 డిగ్రీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

bmw s1000rr rider takes risk to save dog

ఓ రోడ్డుపై BMW S 1000 ఆర్‌ఆర్‌ బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ కుక్క బైక్‌కు అడ్డుగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన బైకర్‌ కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు సడన్‌ బ్రేక్‌ వేశాడు. ఈ వీడియో బయటకు వచ్చాక.. చాలా మంది బైకర్‌ను మెచ్చుకుంటున్నారు. అంతవేగంలోనూ కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు పెద్ద రిస్క్‌ చేశాడు అంటూ కితాబు ఇస్తున్నారు.

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం లేదు. కానీ బైక్‌ రైడర్‌ ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా భారీ ప్రమాదం జరిగేది. సుమారు 20 లక్షల రూపాయల విలువైన బైక్‌ భారీగా డ్యామేజీ అయ్యేది. మరియు మరమ్మతులకు లక్షలు ఖర్చుచేయాల్సి వచ్చేది.

bmw s1000rr rider takes risk to save dog

ఓ జాతీయరహదారిపై కొందరు తమ బైక్‌లలో ప్రయాణిస్తున్నండగా ఈ ఘటన జరిగింది. ఆ సమీపంలో ఉన్న ఓ వాహనంలోని 360 డిగ్రీల కెమెరా ఈ వీడియోను రికార్డు చేసింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు బైక్‌ రైడర్‌ సాహసానికి కచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేరు.

ఒక్క క్షణం కేవలం ఒకే క్షణంలో బీఎండబ్ల్యూ బైకర్‌ తన వాహనాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత బైక్‌ను కొంచెం స్లో చేశారు. అయినా కుక్క అక్కడ నుంచి కదలకపోవడంతో సడన్‌ బ్రేక్‌ వేశారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేది. వెనుక కూడా కొన్ని వాహనాలు వస్తుండడం వీడియోలో మనం గమనించవచ్చు. వారు కూడా గాయపడే అవకాశం ఉండేది.

జాతీయ రహదారులు సహా ఇతర రోడ్లపై బైక్‌ నడిపిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జంక్షన్ల వద్ద మనుషులు, పశువులు, సహా ఇతర జంతువులు వాహనాలకు అడ్డుగా వచ్చే ప్రమాదాలు ఉంటాయి. దాంతోపాటు బైక్‌ డ్రైవింగ్‌ చేసినప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్‌ ధరించాలి. మరియు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలి.

రాత్రి సమయాల్లో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి, విద్యుత్‌ బల్బులు లేని రోడ్లపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎదురుగా, వెనుక వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవింగ్‌ చేయాలి. వీలైనంత వేగంగా ప్రయాణం చేయాలి. హై బీమ్ బల్పులు వినియోగాన్ని తగ్గించాలి, ఈ లైట్‌ కారణంగా ఎదురుగా వచ్చిన వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటారని గుర్తించాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 27, 2023, 18:34 [IST]
English summary
Bmw s1000 rr rider stopped his bike to save dog video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+