వీడియో: మనం బైక్‌పై కాదు, బైకే మనపై కూర్చుంటే..
బైక్ మనం కూర్చుని రైడ్ చేస్తుంటే సరదాగా ఉంటుంది, కానీ అదే బైక్ మనపై కూర్చుంటే ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. ఇదిగో ఈ వీడియో చూడండి.. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ నిర్లక్ష్యపు వ్యక్తి రోడ్డు దాటుతుండగా, అతడిని తప్పించే ప్రయత్నంలో ఓ మోటారిస్ట్ గాయపడ్డాడు.
మరిన్ని వీడియోల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి
అటూ ఇటూ వాహనాలు వేగంగా వెళ్తున్న రోడ్డుపై ఓ సూపర్‌బైక్ వెళ్తున్న రైడర్ తనకు అడ్డుగా రాబోయిన రెక్లెస్ వ్యక్తిని తప్పించేందుకు ఎమర్జెన్సీ బ్రేక్ (బహుశా ఫ్రంట్ డిస్క్ బ్రేక్) అప్లయ్ చేయటంతో బైక్ నిటారుగా పైకి లేచి బోర్లాపడిన రైడర్‌పై బైక్ వెళ్లికిలా పడింది.
ఈ ప్రమాదానికి కారణమైన రైడర్ పరిగెత్తుకుంటూ రోడ్డు దాటుకొని వెళ్లిపోయాడు. అయితే, అటుగా వస్తున్న కొందరు కార్ డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి బైక్‌ను పక్కకు జరిపి, సదరు రైడర్‌ను రక్షించారు. ఈ ప్రమాదంలో బైక్ రైడర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణంగా అక్రమంగా రోడ్డు దాటిన సదరు వ్యక్తే. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Y7n3X2h_N3k?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








