ఒకటి అంటుకుంది, మరో మూడింటిని అంటించింది!

కోట్ల రూపాయలు ఖరీదు చేసే అత్యంత అరుదైన మరియు విలాసతవంతమైన సూపర్‌కార్లు ప్రమాదవశాత్తు డ్యామేజ్ అయినా లేక అగ్నికి ఆహుతైనా వాటి యజమానులుకే కాదు చూసేవారికి అయ్యో అనిపిస్తుంది. అలాంటి ఓ సంఘటన థాయ్‌లాండ్‍‌లో చోటు చేసుకుంది. ఓ పెద్ద ట్రక్కులో తరలిస్తున్నా నాలుగు సూపర్‌‌కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

ఈ సూపర్‌కార్లన్నీ కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేసినవి కావటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ట్రక్కులో ఫెరారీ ఎఫ్430, లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి640, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కార్లను తరలిస్తున్నారు. ఇందులో ముందుగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారులో మంటలు చెలరేగడంతో అవి క్రమంగా ఇతర కార్లను కూడా దహించి వేశాయి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మంటల్లో 4 లగ్జరీ కార్లు..

తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని ఫొటోలను, వివరాలను పరిశీలించండి.

ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా

ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా

ఈ ప్రమాదంలో ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా దాదాపు 80 శాతం కాలిపోయింది. కారు పైభాగం, ముందు భాగం మరియు ఇంజన్ ప్రాంతం కాలిపోయింది. ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షో 2007లో మైఖేల్ షుమాకర్ ఆవిష్కరించిన మొట్టమొదటి కార్ మోడల్ ఇది.

లాంబోర్గినీ ముర్సిలాగో

లాంబోర్గినీ ముర్సిలాగో

ఇదిగో ఈ ఫొటోలో మీరు చూస్తున్నది లాంబోర్గినీ ముర్సిలాగో కారు. ఈ కారు ముందు భాగం బాగానే ఉన్నప్పటికీ, వెనుక వైపు మాత్రం పూర్తిగా కాలిపోయింది. లాంబోర్గినీ ముర్సిలాగోలో 6.5 లీటర్ వి-12 డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 649 బిహెచ్‌పిల శక్తిని, 67.3 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ సూపర్ కారు కేవలం 3.8 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 340 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది.

బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్

బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్

ఈ ప్రమాదంలో బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్ పూర్తిగా రిపేరు చేయటానికి వీళ్లేనంతగా కాలిపోయింది. కంపెనీ వాస్తవానికి ఈ కారును 2-డోర్ వెర్షన్ (కాంటినెటల్ జిటి)గా తయారు చేసింది. ఇందులో ఫ్లయింగ్ స్పౌర్ వేరియంట్ అనేది రెగ్యులర్ కాంటినెంటల్ జిటి వేరియంట్‌కి పొడగించబడిన వీల్‌బేస్ కలిగిన వేరియంట్. ఇతర సూపర్ కార్ల మాదిరిగా ఇందులో కార్బన్ ఫైబర్‌ను కాకుండా చెక్కను ఉపయోగిస్తారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 లగ్జరీ కారుతో పాటు ఇతర మూడు కార్లు కూడా దాదాపు పూర్తిగా రిపేరు చేయడానికి వీళ్లేనంతగా డ్యామేజ్ అయ్యాయి.

మంటల్లో 4 లగ్జరీ కార్లు..

మరి ఈ కాలిపోయిన కార్లకు ఇన్సూరెన్స్ వస్తుందో లేక వాటి యజమానుల జేబుకు చిల్లు పడుతుందో అనేది తెలియాల్సి ఉంది.


Picture credit: wreckedexotics.com

More from DriveSpark

Article Published On: Friday, July 11, 2014, 9:31 [IST]
English summary
Supercars have the knack of finding their way into news around the world, ranging from their launches to spectacular crashes. To this league joins Thailand. The latest mishap happened when four supercars ended up as molten steel and melted carbon fibre after they caught fire.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+