BNCAP తొలి పరీక్షలు ఈ కార్లపైనేనా.. వచ్చే నెల నుంచే అందుబాటులోకి సేఫ్టీ రేటింగ్‌ వ్యవస్థ..!

భారత్‌లో తయారైన కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇచ్చే వ్యవస్థ ఇటీవల దేశంలో విడుదల అయింది. BNCAP- భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రొగ్రాంను ఆగస్టు 22న కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ వ్యవస్థ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

BNCAP వ్యవస్థ ద్వారా దేశంలో తయారైన కార్లకు రేటింగ్‌ ఇవ్వనున్నారు. ఫలితంగా సమయం, డబ్బు ఆదా కానుంది. గ్లోబల్‌ NCAP మాదిరిగానే భారత్‌ NCAP కూడా అవే ప్రోటోకాల్‌ కలిగి ఉంటుంది. అనేక రకాల పరీక్షలు చేసి 1 నుంచి 5 వరకు సేఫ్టీ రేటింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం భారత్‌లో తయారయ్యే అన్ని కార్లు ఈ నిబంధనల ప్రకారం క్రాష్ టెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.

BNCAP begins from October

అయితే ఇప్పటి వరకు క్రాష్‌ టెస్ట్‌ కోసం ధరఖాస్తు చేసుకున్న కార్ల అధికారిక సమాచారం ఇంకా విడుదల కాలేదు. అయితే ఇప్పటి వరకు ఏ సేఫ్టీ ఏజెన్సీలోనూ పరీక్షలు చేయించుకోని కొన్ని కార్లు భారత్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ కార్లు భారత్‌ NCAP ద్వారా సేఫ్టీ రేటింగ్‌ పొందే అవకాశం ఉంది.

మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా 2022 సంవత్సరంలో మారుతి సుజుకి సంస్థ విడుదల చేసిన అత్యుత్తమ విక్రయాలు నమోదుచేసుకున్న కార్లలో ఇది ఒకటి. ఈ కారు ఎంట్రీ వేరియంట్‌ సేఫ్టీ ఫీచర్‌గా కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇతర వేరియంట్లలో సీట్‌ బెల్ట్‌ వార్నింగ్‌, వెనుక సీట్లకు సీట్‌ బెల్ట్‌, చైల్డ్‌ సీట్‌ కోసం యాంకర్‌ పాయింట్‌ ఉన్నాయి.

BNCAP begins from October

దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, టైర్‌ ప్రజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఫీచర్లు ఉన్నాయి. మిడ్‌, టాప్‌ వేరియంట్‌ మాత్రమే 6 ఎయిర్‌ వెంట్‌లు కలిగి ఉంటాయి. రెండు కర్టన్‌ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఎకౌస్టిక్‌ వెహికల్‌ అలర్ట్ సిస్టమ్‌ అనే సరికొత్త ఫీచర్‌ను ఉంది. ఇది కారు దగ్గరగా నడిచేవారి ప్రాణాలను కాపాడుతుంది. భారత్‌ NCAP వ్యవస్థ ద్వారా సేఫ్టీ రేటింగ్‌ పొందే అవకాశం ఉంది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ ఈ కారును హ్యుందాయ్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీగా విడుదల చేసింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు సహా అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ISOPIX చైల్డ్‌ మౌంట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ సహా అనేక భద్రతా ఫీచర్లున్నాయి. సేఫ్టీ టెస్టులో మంచి రేటింగ్‌ సాధించే అవకాశం ఉంది.

BNCAP begins from October

కియా సెల్టోస్‌ 2023 కారు లెవల్‌ 2 ADAS -అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది దీంతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, అసిస్ట్‌ కంట్రోల్‌, స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌ సహా సుమారు 15 రకాల ఫీచర్లు ఈ కారు సొంతం. ఈ కారు ANKAP పరీక్షలో 5 స్టార్‌ రేటింగ్‌ను కలిగి ఉంది. భారత్‌లోనూ 5 స్టార్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఉంది.

హోండా ఎలివేట్‌ కారు ఇటీవలే విడుదల అయింది. బిల్డ్‌ క్వాలిటీ సహా ADAS టెక్నాలజీని కలిగి ఉంది. దీంతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX, హిల్‌స్టార్ట్‌, వెనుక పార్కింగ్‌ కెమెరాలు ఉన్నాయి. ఈ కారు కూడా 5 స్టార్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.

BNCAP begins from October

మారుతి జిమ్నీ కారు ఈ సంవత్సరంలోనే విడుదల అయింది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, హిల్ డిసెంట్‌ కంట్రోల్‌, బ్రేక్‌ అసిస్ట్‌, సైడ్‌ ఇంపాక్ట్‌ డోర్‌ బీమ్‌, ABS సహా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ కారు 3 డోర్‌ వెర్షన్‌ యూరో NCAP పరీక్షల్లో 3 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. భారత్‌ NCAP పరీక్షల కోసం ఎదురుచూస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 6, 2023, 11:33 [IST]
English summary
Bncap begins from october which car are going for crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+