బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, యాక్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మరియు పెట్టుబడిదారుడు అయిన బాబీ చెమ్మన్నూర్ (Boby Chemmanur) కార్ గ్యారేజ్ లోకి కొత్తగా మరో బ్రిటీష్ లగ్జరీ కార్ మోడల్ వచ్చి చేరింది. టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవలే విడుదల చేసిన సరికొత్త రేంజ్ రోవర్ వెలార్ లగ్జరీ కారును ఆయన సొంతం చేసుకున్నారు.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

బాబీ చెమ్మన్నూర్ వద్ద అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉపయోంగిచిన గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్‌ కారు కూడా ఉంది. ఈ గోల్డ్ కలర్ ఫాంటమ్ కారును డొనాల్డ్ ట్రంప్ కోసం రోల్స్ రాయిస్ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చింది. ఈ కారులో ఒక థియేట్రికల్ ప్యాకేజీ, స్టార్‌లైట్ హెడ్‌లైనర్ మరియు ఎలక్ట్రానిక్ కర్టెన్‌లు వంటి ఎన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, భారతదేశంలోనే మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అయిన మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి కూడా ఇతను యజమాని.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

బాబీ చెమ్మన్నూర్ కి ఖరీదైన కార్లంటే మక్కువ ఎక్కువ. ఇతని వద్ద ఇప్పటికే అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన రేంజ్ రోవర్ వెలార్ లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఈ వాహనం డెలివరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో హల్ చల్ చేస్తోంది. తెలుపు రంగు రేంజ్ రోవర్ వెలార్ కారును ఆయన కొనుగోలు చేశారు.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్), గడచిన జూన్ 2021 నెలలో తమ కొత్త రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఆ సమయంలో ఈ కారు ప్రారంభ ధర రూ.79.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. రేంజ్ రోవర్ వెలార్‌ను మొట్టమొదటి సారిగా 2017 డిసెంబర్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.78.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

ఆ తర్వాత 2019లో మేడ్-ఇన్-ఇండియా వెలార్‌ను జేఎల్ఆర్ ప్రవేశపెట్టింది. మేడ్ ఇన్ ఇండియా కారణంగా దాని ధర దిగొచ్చింది. రెండేళ్ల క్రితం ఈ కారు ధర రూ.72.47 లక్షలుగా ఉండేది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీ ధరను తిరిగి రూ.7.4 లక్షలు పెంచింది. అయితే, పెరిగిన ధరకు అనుగుణంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ కొత్త 2021 రేంజ్ రోవర్ వెలార్‌లో అనేక అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. ఇది ప్రపంచంలోనే సాంకేతికంగా అత్యంత ఆధునికమైన ఎస్‌యూవీ అని కంపెనీ చెబుతోంది.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీని కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న చిన్న ఎస్‌యూవీ ఎవోక్ మరియు పెద్ద ఎస్‌యూవీ డిస్కవరీ మోడళ్ల మధ్యలో వ్యత్యాసాన్ని పూరించేందుకు ప్రవేశపెట్టబడింది. రేంజ్ రోవర్ వెలార్ డిజైన్ దాని చిన్న ఎస్‌యూవీ అయిన రేంజ్ రోవర్ ఎవోక్ నుండి ప్రేరణ పొందింది. వెలార్ ఎస్‌యూవీ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు కంట్రోల్ ప్యానెల్ మొదలైనవి ఉన్నాయి.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన 2021 రేంజ్ రోవర్ వెలార్‌ ఎస్‌యూవీలో కంపెనీ అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 246 హెచ్‌పి శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 201 హెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

కాగా, బాబీ చెమ్మన్నూర్ కొనుగోలు చేసింది డీజిల్ వేరియంట్ అని తెలుస్తోంది. ఈ రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీలో టార్క్-ఆన్-డిమాండ్ ఆల్ వీల్ డ్రైవ్, టెర్రైన్ రెస్పాన్స్ 2 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో స్టాండర్డ్ గా జత చేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రేంజ్ రోవర్ వెలార్ కేవలం 8.20 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 210 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

ఈ ఎస్‌యూవీలో లభించే మరికొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 14 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రికల్ టిల్ట్-కెపాసిబుల్ రియర్ సీట్, పానోరమిక్ సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెదర్ సీట్లు, స్టీరింగ్, ప్రీమియం స్పీకర్ సిస్టమ్, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

బాబీ చెమ్మన్నూర్ గ్యారేజ్‌లో కొత్తగా వచ్చిన చేరిన బ్రిటీష్ లగ్జరీ కార్

బాబీ చెమ్మన్నూర్ కారు గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈయన వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ VII కారు కూడా ఉంది. అంతేకాదు, కేరళలోనే మొట్టమొదటి రోల్స్ రాయిస్ టాక్సీ పథకాన్ని ప్రారంభించిన వ్యక్తి కూడా బాబీనే. తక్కువ ధరలో విలాసవంతమైన వాహనాలను ఆస్వాదించడానికి సాధారణ ప్రజలకు ఇదొక చక్కటి అవకాశం. ఈయన కార్ కలెక్షన్ లో డిసి అవంతి, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మరియు పొలారిస్ స్లింగ్ షాట్ వంటి వాహనాలు ఉన్నాయి. బాబీ చెమ్మనూర్ గత ఏడాది హెలికాప్టర్ టాక్సీ సేవలను కూడా ప్రారంభించారు.

Most Read Articles

English summary
Boby chemmanur adds new range rover velar luxury suv to his car collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X