Just In
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అందరికి తెలిసిందే, ఇటీవల అమెరికా ఎన్నికలలో భారీ ఓటమితో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు. అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ వేలం వేయనున్నట్లు తెలిసింది. ఈ వేలంలో భారతదేశానికి చెందిన బాబీ చెమ్మనూర్ పాల్గొన్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

కేరళకు చెందిన బాబీ చెమ్మనూర్ అనే వ్యాపారవేత్త గురించి పెద్దగా పరిచయం అవసరం లేదా. బాబీ చెమ్మనూర్ నగల దుకాణాలు కలిగి ఉన్నారు. తన నగల షోరూమ్ ప్రారంభోత్సవం కోసం ఫుట్‌బాల్ లెజెండ్ దివంగత డియెగో మారడోనాను కేరళకు తీసుకువచ్చారన్న సంగతి ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు.

బాబీ చెమ్మనూర్ ఇటీవల మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు కూడా నివేదికల ద్వారా తెలిసింది. భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి. అంతే కాకుండా బాబీ చెమ్మనూర్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాహనాలలో ఒకటైన రోల్స్ రాయిస్ కారును టాక్సీగా నడుపుతున్నాడు.
MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఈ రకంగా బాబీ చెమ్మనూర్ పేరు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను వేలం వేసే ప్రయత్నంలో బాబీ చెమ్మనూర్ పాల్గొన్నాడు. డొనాల్డ్ ట్రంప్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ వేలంలో పాల్గొంటున్నట్లు బాబీ చెమ్మనూర్ స్వయంగా తెలిపాడు. మా టెక్సాస్ కార్యాలయం ఇప్పటికే బిడ్‌లో పాల్గొనడానికి చొరవ తీసుకుంటుందని తెలిపాడు.

డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో థియేటర్ ప్యాకేజీ, స్టార్‌లైట్ హెడ్‌లైనర్ మరియు ఎలక్ట్రానిక్ కర్టెన్‌లు చాలా ముఖ్యమైనవి. ఈ కారు ఇప్పటికి మొత్తం 91,249 కిలోమీటర్లు ప్రయాణించింది.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ 2010 మోడల్. రోల్స్ రాయిస్ కంపెనీ నిర్మించిన 2010 మోడల్ ఫాంటమ్ కారు ఇది, ఆ కాలంలో కంపెనీ తయారు చేసిన 537 కార్లలో ఒకటి. ఈ కారు మూల ధర సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నాము.

అయితే వేలం ఎలా సాగుతుందనే విషయం గురించి సరైన సమాచారం తెలియదు. ప్రపంచవ్యాప్తంగా వున్నా చాలామంది కార్ ప్రేమికులు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. వీరిలో ఎవరు ఈ కారుని సొంతం చేసుకుంటారో కచ్చితంగా తెలియదు. ఇందులో పాల్గొన్న బాబీ చెమ్మనూర్ వేలంలో గెలుస్తారో, లేదో తెలియాలంటే కొంత వేచి చూడక తప్పదు.
MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

బాబీ చెమ్మనూర్ కేవలం ఒక్క ఆటోమోటివ్ ప్రేమికుడు మాత్రమే కాదు, మంచి స్వభావం కలిగిన ఉదార వ్యక్తిగా కూడా. అతను ఇప్పటికే చాలా సార్లు రక్తదానం కూడా చేసాడు. అంతే కాకుండా సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో ఆయన క్రమం తప్పకుండా పాల్గొంటూ ఉంటారు.