ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

సుదూర ప్రయాణాలకు బోయింగ్ విమానాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. విమానాల తయారీలో సింహ భాగం వాటా కలిగి ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోయింగ్ విమానయాన సంస్థ, ఇప్పుడు తమ బోయింగ్ 737 చరిత్రలోనే అతిపెద్ద విమానాన్ని తయారు చేసి, అందరిచేత ఔరా అనిపించుకుంటోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

బోయింగ్ 737 MAX కుటుంబంలో అతిపెద్ద విమానమైన బోయింగ్ 737-10 విమానం తన మొదటి ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. జూన్ 18న ఈ విమానం ఉదయం 10:07 గంటలకు వాషింగ్టన్‌లోని రెంటన్ ఫీల్డ్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:38 గంటలకు సీయాటెల్‌లోని బోయింగ్ ఫీల్డ్‌లో దిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

ఈ బోయింగ్ 737-10 విమానాన్ని నడిపిన చీఫ్ పైలట్ కెప్టెన్ జెన్నిఫర్ హెండర్సన్ మాట్లాడుతూ "ఈ విమానం చాలా అద్భుతంగా ప్రదర్శించింది. మేము ప్రయాణించిన ప్రొఫైల్ విమానం యొక్క వ్యవస్థలు, విమాన నియంత్రణలు మరియు నిర్వహణ లక్షణాలను పరీక్షించడానికి ఇది మాకు అనుమతి ఇచ్చింది, ఇవన్నీ మంచి పనితీరును కనబరిచాయి" అని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

బోయింగ్ 737 ఫ్యామిలీలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్ 737-10 మ్యాక్స్ గరిష్టంగా 6,110 కిలోమీటర్లు (3,300 నాటికల్ మైళ్ళు) దూరం ప్రయాణించగలదు. ఇందులో 230 మంది ప్రయాణీకుల సీట్లు ఉంటాయి. ఇప్పటికే సర్వీసులోకు వచ్చిన 737-8, 737-9 మాక్స్ విమానాల తర్వాత 737-10 విజవంతంగా అందుబాటులోకి రానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

కాగా, బోయింగ్ 737 సిరీస్‌లో రూపొందించిన 737-7 చిన్న విమానం ఇంకా ధృవీకరణ కోసం వేచి ఉంది. కాగా. బోయింగ్ 737 MAX 10 యొక్క మొదటి డెలివరీలను 2023 నాటికి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ MAX 10 కోసం మొదటి ప్రయోగ విమానయాన సంస్థ అవుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే బోయింగ్ 737-10 MAX కోసం 100 యూనిట్లు ఆర్డర్ చేసింది. మొత్తంగా చూసుకుంటే, ఈ మోడల్ కోసం సుమారు 20 విమానయాన సంస్థల నుండి 550 యూనిట్లకు పైగా ఆర్డర్లను నమోదయ్యాయని బోయింగ్ పేర్కొంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

బోయింగ్ 737 విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా, ఇథియోపియా మరియు ఇండోనేషియాలలో జరిగిన రెండు ఘోర విమాన ప్రమాదాలలో సుమారు 346 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ విమాన సేవలను నిలిపివేయాల్సిందిగా యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

అయితే, దాదాపు 20 నెలల విరామం తరువాత, బోయింగ్ 737 MAXను యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీసర్టిఫై చేసి, వీటిని తిరిగి సర్వీసులోకి తీసుకోవచ్చని నవంబర్ 2020లో ప్రకటించింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల వలన వరుసగా రెండు ప్రమాదాలు జరగడంతో, ఏప్రిల్ 2021లో, ప్రపంచవ్యాప్తంగా 109 బోయింగ్ 737 MAX విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 737 విమానం; తొలి ప్రయోగం విజయవంతం!

ఈ విమానంలోని ఎలక్ట్రికల్ గ్రౌండింగ్‌ను ప్రభావితం చేసే సాంకేతిక సమస్యలు కనుగొనబడిన తరువాత వాటి డెలివరీలు కూడా నిలిపివేయబడ్డాయి. అయితే, ఇందుకు సంబంధించిన పరిష్కారాలను ఎఫ్ఏఏ ఆమోదించిన తర్వాత మే 19, 2021వ తేదీన వీటి సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Image Courtesy: Boeing

Most Read Articles

English summary
Boeing 737-10 Completes Maiden Flight; Largest Boeing 737 Model Ever Made, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X