హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్ విమానం

By Ravi

హైదరాబాదీలకు గుడ్ న్యూస్. ఇకపై హైదరాబాద్ నుంచి లండన్‌కు అలాగే లండన్ నుంచి హైదరాబాద్ ప్రయాణించే వారి కోసం ప్రత్యేక విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 'బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌' ఇప్పుడు శంషాబాద్ నుంచి టేకాఫ్/ల్యాండింగ్ కానుంది. ఈ మేరకు బ్రిటీష్ ఎయిర్‌వేస్ హైదరాబాద్ నుంచి లండన్‌కు ప్రతి రోజు విమాన సర్వీసులు ప్రారంభించింది.

తొలి బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్ విమానం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 4.45 నిమిషాలకు చేరుకున్నట్లు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సౌత్‌ ఏషియా రీజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ క్రిస్టఫర్ ఫోర్డిస్ తెలిపారు. కంపెనీ ప్రచారంలో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం రాకతో వారంలో 5 సర్వీసులు కాస్తా 7కి చేరాయి. లండన్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు వారంలో మొత్తం 48 సర్వీసులను నడుపుతున్నట్టు క్రిస్టఫర్ ఫోర్డిస్ సోమవారమిక్కడ వివరించారు. మరిన్ని వివరాలను మరియు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ఫొటోలు ఈ కథనంలో పరిశీలించండి.

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ప్రత్యేకించి దూర ప్రయాణాలకు అనువుగా డిజైన్ చేయబడినది.

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో 210 నుంచి 330 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంటుంది.

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్

భారతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక వంటకాలు, బాలీవుడ్ సినిమాలను ఈ విమానంలో ఆఫర్ చేయనున్నారు.

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్

బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టడం ఇదే మొట్టమొదటి సారి. ఈ క్రెడిట్ బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థకే దక్కుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 1, 2014, 18:55 [IST]
English summary
British Airways Regional Commercial Manager (South Asia) announced the arrival of its first Boeing 787 Dreamliner to Hyderabad on Monday morning through its association with Bollywood star Amitabh Bachchan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+