బోయింగ్ నుంచి అతిపెద్ద డ్రీమ్‌లైనర్ విమానం విడుదల
బోయింగ్ విమానాలకు చెక్ పెడుతూ యూరప్‌కు చెందిన విమానాల తయారీ కంపెనీ ఎయిర్‌బస్ ఓ అధునాతన ఏ350 విమానాన్ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ పోటీని ఎదుర్కునేందుకు బోయింగ్ కూడా ఓ అధునాతన 787-10 డ్రీమ్‌లైనర్ విమానాన్ని విడుదల చేసింది. బోయింగ్ అందిస్తున్న 787 సిరీస్‌లో కొత్తగా వచ్చిన డ్రీమ్‌లైనర్ 787-10 మరింత సమర్థవంతమైనది. ఈ సిరీస్‌లో ఇది మూడవది కావటం విశేషం.
యూరప్, ఆసియా మరియు నార్త్ అమెరికాల నుంచి ఈ మోడల్‌కు అప్పుడు భారీ ఆర్డర్లు వచ్చి పడ్డాయి. ఎయిర్ లీజ్ కార్పోరేషన్ 30 విమానాలను, జిఈ క్యాపిటల్ ఏవియేషన్ 10, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్/బ్రిటీష్ ఎయిర్‌వేస్ 12, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 30, యునైట్ ఎయిర్‌లైన్స్ 20 విమానాలను బుక్ చేసుకున్నాయి.
ఈ బోయింగ్ 787-00 డ్రీమ్‌లైనర్ విమానం 7,000 నాటకన్ మైళ్ల (సుమారు 12,964 కిలోమీటర్ల) దూరం ప్రయాణించగలదు. దీని సీటింగ్ సామర్థ్యం 300-330 ప్యాసింజర్లు (ఎయిర్‌లైన్స్ సంస్థల ఎంపికను బట్టి). జెట్‌లైనర్ చరిత్రలోనే 787-10 డ్రీమ్‌లైనర్ విమానం అత్యంత ఇంధన సామర్థ్యం కలిగినదని, ఇందులో ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ప్రెసిడెంట్, సీఈఓ రే కోన్నర్ తెలిపారు.
పెద్ద డిమ్మబల్ విండోస్, క్లీనర్ ఎయిర్, అధిక హ్యుమిడిటీ, తక్కువ క్యాబిన్ ఆల్టిట్యూడ్, పెద్ద స్టౌఏజ్ బిన్స్, సూతింగ్ ఎల్ఈడి లైటింగ్ అండ్ స్మూతర్ రైడ్ వంటి ప్యాసింజర్ కంఫర్ట్ ఫీచర్లు ఈ బోయింగ్ 787-10 డ్రీమ్‌లైనర్ విమానాల సొంతం.













Click it and Unblock the Notifications








