స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

ఫ్రెండ్ షిప్ అంటే నిజంగా ఒక మధురమైన అనుభూతి, ప్రేమించే వారిలో అయినా స్వార్ధం ఉంటుందేమో కానీ ఎటువంటి స్వార్థం లేకుండా ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయడానికి కూడా వెనుకాడని బంధం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఫ్రెండ్ షిప్. భారతదేశంలో మొత్తం కరోనా మహమ్మారి చేత పీడించబడుతున్న సమయంలో ఒక వ్యక్తి తన స్నేహితుడి కోసం ఏకంగా 1,400 వందల కిలోమీటర్లు ప్రయాణించాడు.. ఇంతకీ దీని వెనుక ఉన్న అసలు కథను ఒక సారి చూద్దాం.. రండి.

స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

కరోనా కష్ట కాలంలో బయటకు వెళ్లడానికే భయపడుతున్న ఈ కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి మాత్రం తన స్నేహితుడి కోసం చాలా రిస్క్ చేశాడు. అతడు స్నేహితుని కోసం చేసిన సాహసానికి ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

నివేదికల ప్రకారం దేవేంద్ర అనే వ్యక్తి టీచర్‌గా పని చేస్తూ జార్ఖండ్‌లోని బొకారోలో నివాసం ఉతున్నాడు. దేవేంద్ర స్నేహితుడు రంజన్ అగర్వాల్ ఢిల్లీలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల రంజన్ అగర్వాల్ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని నోయిడాలోని ఆసుపత్రికి తరలించారు.

MOST READ:కొత్త కార్ల విడుదలపై కోవిడ్-19 పంజా: కార్ మేకర్లను వణికిస్తున్న వైరస్!

స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

రంజన్ అగర్వాల్ కరోనా వైరస్ కారణంగా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఆక్సిజన్ కొరత ఉంది. నోయిడా కూడా ఆక్సిజన్ కొరత ఉన్న కారణంగా హాస్పిటల్ సిబ్బంది, రంజన్ అగర్వాల్ కుటుంబసభ్యులకు ఆక్సిజన్ సిలిండర్ లేకుంటే ఏమి చేయలేమని చెప్పేసారు.

స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

రంజన్ అగర్వాల్ కుటంబసభ్యులకు ఏమిచేయాలో దిక్కుతోచలేదు. ఆ సమయంలో రంజన్ అగర్వాల్ కుటుంబసభ్యులకు అతని ఫ్రెండ్ దేవేంద్ర గుర్తుకు వచ్చాడు. వెంటనే దేవేంద్రకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పారు. విషయం తెలుసుకున్న దేవేంద్ర ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాడు.

MOST READ:కరోనా నియంత్రణలో నేను సైతం అంటున్న మారుతి సుజుకి; వివరాలు

స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

దేవేంద్ర వెంటనే జార్ఖండ్ లోని ఆక్సిజన్ ప్లాంట్‌కు వెళ్లి 10,000 రూపాయలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొన్నాడు. దాన్ని తన కారులో పెట్టుకుని స్నేహితుని వద్దకు బయలుదేరాడు. రాష్ట్రాలు దాటుకుంటూ ఏకంగా 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. చివరికి నోయిడా చేరుకున్నాడు.

స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

దేవేంద్ర తన స్నేహితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ అందించి అలా తన ఫ్రెండ్ ని కాపాడుకున్నాడు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని చాలామంది దేవేంద్రను పొగడ్తలతో ముంచెత్తారు. మిత్రుడి కోసం దేవేంద్ర చేసిన రిస్క్‌ నిజంగా ప్రశంసనీయం. దేవేంద్ర లాంటి ఫ్రెండ్ ఉన్న రంజన్ అగర్వాల్ నిజంగా అదృష్టవంతుడు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

MOST READ:రోల్స్ రాయిస్ డాన్ మరియు వ్రైత్ మోడళ్లకు శుభం కార్డ్; ఉత్పత్తి నిలిపివేత!

Note: Images are representative purpose Only.

Most Read Articles

English summary
Bokaro Man Travels 1400 Kms To Noida With Oxygen To Save Corona Positive Friend. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X