అక్షయ్ కుమార్ కొత్త కారు చూశారంటే మతిపోవాల్సిందే.. ఇదోక కదిలే ఇంద్రభవనం.. దీని రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!

బాలీవుడ్ తారలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇండియన్ మార్కెట్లోకి టాప్ కంపెనీ నుంచి ఏ కారు విడుదలైన చాలు వెంటనే వాటిని కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. ఈ జాబితాలో ప్రముఖ సెలబ్రిటీల నుంచి మొదలుకుని క్రికెటర్లు, పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లగ్జరీ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. అక్షయ్ కుమార్‌ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకే ఏడాదిలో అత్యధికంగా సినిమాలు చేసిన హీరోగా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఆయన నటించిన సినిమాలన్నీ మినిమం గ్యారెంటీగా ఉండేవి. ముఖ్యంగా బాలీవుడ్‌లో అత్యధికంగా వరుసగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల్లో హీరోగా ఉన్నారు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన 7 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేకపోయియి.

ప్రధానంగా మినిమం గ్యారెంటీ హీరోగా పేరున్న నటుడికి ఇటీవల 4 సినిమాలు బాగా నిరాశను మిగిల్చాయి. వీటి ఓపెనింగ్‌లు దాదాపు రూ.3 కోట్ల లోపే ఉండవచ్చని సంబంధిత వర్గాల సమాచారం. అయినప్పటికి కూడా హిందీ చిత్ర పరిశ్రమలో అక్షయ్ కుమార్‌ టాప్ హీరోల లిస్ట్‌లో ఉన్నారు. ఇంతటి పేరున్న నటుడికి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.

Akshay Kumar New Toyota Vellfire

అందుకే ఆయన తాజాగా ఒక లగ్జరీ ఫీచర్లతో భూతల స్వర్గంలా ఉండే కారును కొనుగోలు చేశారు. ఆయన కొన్నటువంటి కారు జపాన్ కార్ల తయారీ కంపెనీ టయోటా నుంచి విడుదల అయినటువంటి లగ్జరీ ఎమ్‌పీవీ వెల్‌ఫైర్‌(luxury mpv vellfire). ఇది రోడ్డుపై వెళ్తుంటే ఒక ఇంద్రభవనం కదిలి వెళుతున్నట్లుగా ఉంటుంది. దీనిలో ఉన్న ఫీచర్లు అన్ని కూడా అడ్వాన్స్‌ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

ఈ కారును ఎక్కువగా వీవీఐపీ(VVIP), వీఐపీ(VIP)లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ కారు సెలబ్రిటీలలో ఎక్కువ డిమాండ్ ఉన్న మోడల్‌గా గుర్తింపు పొందింది. ఇది హాయ్, వీఐపీ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ.1.32 కోట్ల ఎక్స్-షోరూమ్. ముంబైలో ప్రస్తుతం దీని ఆన్‌రోడ్ ధర, ఇన్సూరెన్స్‌తో కలిపి రూ. 1.60 కోట్లుగా ఉంది.

Akshay Kumar Bought Toyota Vellfire

మొదటి లుక్‌లోనే అందరిని కట్టిపడేసేలా ఉన్న ఈ ఎంపీవీలో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. పైకప్పుతో పాటు, లోపల ఉన్న కలర్స్ డిజైన్ ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముందు, వెనుక సీట్లు చాలా మెత్తగా, కంఫర్ట్‌గా ఉంటాయి. సీటింగ్ వెడల్పుగా ఉంటుంది. రెండవ వరుస సీట్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. సీట్ల మధ్యలో సామాన్లు పెట్టడానికి వీలుగా ఈ సదుపాయాన్ని ఇచ్చారు.

టయోటా వెల్‌ఫైర్ ఒక హైబ్రిడ్ ఎంపీవీ. ఇది 2.5-లీటర్ (పెట్రోల్ - ఎలక్ట్రిక్) ఇంజిన్‌ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ 142 kW పవర్‌ను, గరిష్టంగా 240 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు 19.28 kmpl మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా దీనిలో ప్రయాణికుల భద్రతకు కంపెనీ చాలా అధునాతన సదుపాయాలను ప్రత్యేకంగా అందించింది. దీంతో యాక్సిడెంట్ సమయంలో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగదు.

Akshay Kumar Toyota Vellfire

వెల్‌ఫైర్‌లో ప్రధాన ఆకర్షణ దాని డిజైన్‌తో పాటు 9-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్. క్యాబిన్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పవర్ కంట్రోల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వెహికల్ డయాగ్నస్టిక్, డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్‌లు, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, పార్క్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టయోటా సేఫ్టీ సెన్స్ ADAS, 360-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

టయోటా వెల్‌ఫైర్‌ను అక్షయ్ కుమార్‌ కంటే ముందుగా అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్, అజయ్ దేవగన్ వంటి పలువురు బాలీవుడ్ తారలు కలిగి ఉన్నారు. హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న వారే కాకుండా మాలీవుడ్‌కు సినీ పరిశ్రమకు చెందిన మోహన్‌లాల్, బిజు మీనన్, సురేష్ గోపి వంటి ప్రముఖులు కూడా వెల్ఫేర్ ఎంపీవీని కలిగి ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2024, 8:20 [IST]
English summary
Bollywood actor akshay kumar bought toyota vellfire here the all details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+