లగ్జరీ కార్లను వదిలి మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. కారణం తెలిస్తే షాకవుతారు.!!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar Metro) మెట్రోలో ప్రయాణించారు. లగ్జరీ కార్లను వదిలి అక్షయ్ కుమార్ మెట్రోలో ప్రయాణించడంపై.. తోటి ప్రయాణికులే కాదు, ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ఈ ఫొటోలు, వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు సైతం అవాక్కయ్యారు. అసలు అక్షయ్ కుమార్ మెట్రో రైలులో ఎందుకు ప్రయాణించారు.??
దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ప్రతి ఒక్కరూ అనుభవిస్తుందే.. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిందే.. ఈ సమస్య సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా అనుభవమే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

ఈ సారి ఈ ట్రాఫిక్ సమస్య బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు ఎదురైంది. ముంబయి ట్రాఫిక్‌తో విసిగిపోయి.. తన లగ్జరీ కార్లను వది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయిన మెట్రోలో ప్రయాణించారు ఈ స్టార్ హీరో. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే అక్షయ్ కుమార్(Akshay Kumar Metro Train Viral Video) మాస్క్ పెట్టుకుని మెట్రో ట్రైన్లో ప్రయాణించారు.
అక్షయ్ కుమార్ తన లగ్జరీ కార్లను వదిలి ముంబయి మెట్రోలో ప్రయాణించడం ప్రయాణికులతో పాటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ దగ్గర ఖరీదైన కార్, బైక్ కలెక్షన్స్ ఉన్నాయి. అయితే ముంబయి ట్రాఫిక్(Akshay Kumar Travel In Metro) సమస్య నుంచి అక్షయ్ కుమార్‌ను లగ్జరీ కార్లు తప్పించలేకపోయాయి.

అక్షయ్ కుమార్ మెట్రోలో ప్రయాణిస్తుండగా, తోటి ప్రయాణికులు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. ముంబయి ట్రాఫిక్ పరిస్థితిని తమ కామెంట్ల ద్వారా వివరించారు. కాగా అక్షయ్ కుమార్ మాస్క్, క్యాప్ ధరించి మెట్రోలో ప్రయాణించినప్పటికీ ప్రయాణికులు అతడిని గుర్తించారు.
కాగా అక్షయ్ కుమార్‌కు ఎలాంటి కార్లు ఉన్నాయో పరిశీలిస్తే అందులో మొదటగా ఉండేది అతని రేంజ్ రోవర్ వోగ్(Range Rover Vogue). పోర్స్చే కయెన్‌కి ప్రత్యక్ష పోటీదారు రేంజ్ రోవర్ వోగ్. ఈ లగ్జరీ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇంకా టాప్-ఎండ్ పెట్రోల్ మోడల్ 5-లీటర్ V8 సూపర్‌ఛార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

పోర్స్చే కయెన్(Porsche Cayenne): గత 15 సంవత్సరాలుగా లగ్జరీ కార్ల ఉత్పత్తిలో గణనీయమైన మైలురాయిని సాధించిన పోర్స్చే కంపెనీకి చెందిన అత్యంత ప్రసిద్ధ కారు కయెన్ మోడల్.. అక్షయ్ కుమార్ గ్యాలరీలో ఉంది. ఈ లగ్జరీ కారు 242 bhp మరియు 550 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తో ఆధారితం.
Mercedes-Benz GLS: అక్షయ్ కుమార్ వద్ద ఉన్న మరో లగ్జరీ కారు కొత్త మెర్సిడెస్ బెంజ్ GLS SUV. 3.0-లీటర్ ఆరు-సిలిండర్ ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఈ పెట్రోల్ వేరియంట్, GLS 450 4మ్యాటిక్, GLS 400d 4మ్యాటిక్ డీజిల్ మోడల్‌తో పాటు విశ్వసనీయమైన 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 4మ్యాటిక్ AWD సిస్టమ్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








