అనిల్ కపూర్ ఇంటికి కొత్త అతిధి.. దాని ‘రేంజ్' వేరే లెవల్.. ఇది వెరీ వెరీ స్పెషల్!
సాధారణంగా మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ కార్లు విడుదల అయితే చాలు, వెంటనే సెలబ్రిటీలు కొనుగోలు చేసి తమ గ్యారేజీల్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా పండుగలకు ముందు ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దేశంలో దీపావళి పండుగ సీజన్ నడుస్తోంది. ఈ టైంలో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా సరికొత్త వాహనాలను తమ ఇంటికి తెచ్చుకుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది సినిమా స్టార్స్, క్రికెటర్లు ఖరీదైన కార్లను కొనుగోలు చేయగా, 40 ఏళ్లకు పైగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 100 కి పైగా సినిమాల్లో నటించి, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్న ప్రముఖ నటుడు అనిల్ కపూర్(Anil Kapoor) కూడా సరికొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ(range rover autobiography) లగ్జరీ ఎస్‌యూవీ(SUV)ని సొంతం చేసుకున్నారు. ఇది అధునాతన ఫీచర్లతో నిండి ఉంది. దీనిలో ప్రయాణిస్తుంటే విలాసవంతమైన అనుభవం కలుగుతుంది.
ధర కూడా దాని రేంజ్‌కు తగ్గట్టుగా రూ.2.60 కోట్ల నుంచి దాదాపు రూ.3.25 కోట్ల మధ్య ఉంది. అనిల్ కపూర్ రూ.3 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. విలాసవంతమైన SUVలలో ఒకటిగా ఉన్న ఈ కారును ప్రపంచంలోని కొంతమంది ప్రముఖులు తమ గ్యారేజీల్లో పెట్టుకోగా, కార్లపై ఆసక్తి కలిగి ఉండే అనిల్ కపూర్ ఇప్పుడు తన కార్ల జాబితాలో కొత్త ఆటోబయోగ్రఫీని కూడా చేర్చుకున్నారు.

సినిమాలే కాకుండా కార్లను కూడా బాగా ఇష్టపడే అనిల్ కపూర్ సొంతం చేసుకున్న రేంజ్ రోవర్ అత్యాధునిక సాంకేతికత, కనెక్టివిటీ ఫీచర్లతో నిండిన విలాసవంతమైన రథంగా రోడ్లపై ప్రయాణిస్తుంది. అందరి చూపు దీనిపై ఉండేలా అదిరిపోయే డిజైన్‌తో ఉంది. అనిల్ ఎంచుకున్న బ్లాక్ కలర్ వేరియంట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అన్ని రకాల రోడ్లపై కూడా సాఫీగా వెళ్తుంది. అనిల్ కపూర్ అక్టోబర్ 2న దీన్ని కొనుగోలు చేశారు.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఇంజిన్-సామర్థ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ గరిష్టంగా 394 bhp పవర్ వద్ద 550 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడ్ కారు నాలుగు చక్రాలకు కూడా మరింత అదనపు శక్తిని అందిస్తుంది.

ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లకు ఈ లగ్జరీ ఎస్‌యూవీ అనువుగా ఉండటంతో సెలబ్రిటీలు ఈ కారు పట్ల తెగ ఆకర్షితులవుతున్నారు. ఇది చూడటానికి భారీగా కనిపించినప్పటికి వేగంగా దూసుకెళ్తుంది. ఇంజిన్ స్టార్ట్ చేసిన కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 km/h వరకు వేగాన్ని అందుకుంటుంది. పైగా రేంజ్ రోవర్ పేరుకు తగ్గట్టుగా క్యాబిన్ లోపల అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
ఈ కారులో 13.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌లు, హెడ్-అప్ డిస్‌ప్లే, నాలుగు-జోన్ ఆటోమేటిక్ HVAC, మంచి సౌండ్ అనుభూతి కోసం రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ప్రీమియం మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 24-వే హీటెడ్, కూల్డ్ ఫ్రంట్ సీట్లు మసాజ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం అనిల్ కపూర్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ బ్లాక్ కలర్ వేరియంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సరికొత్త కారులో ఇంటికి చేరుకున్న ఫొటోలు, వీడియోలు అభిమానులు షేర్ చేస్తున్నారు. దీపావళికి ముందు కొత్త లగ్జరీ ఎస్‌యూవీని తన ఇంటికి తెచ్చుకున్న అనిల్ కపూర్‌కు శుభాకాంక్షలు అంటూ కొంతమంది సోషల్ మీడియాల ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications








