రెండో భార్యకు రూ.93 లక్షల ఖరీదైన లగ్జరీ కారు గిఫ్ట్.. మొదటి భార్య ఈ తతంగం అంతా చూస్తుందా?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ కాకపోయిన ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తెలుగులోనూ నటించారు. జై చిరంజీవా సినిమాలో పశుపతి క్యారెక్టర్‌తో అలరించారు. దీంతో ఆయన తెలుగు సినీ ప్రియులకు పరిచయమనే చెప్పాలి. ప్రముఖ బాలీవుడ్ ఫేమస్ నటీ మలైకా అరోరా (Malaika Arora) మొదటగా వివాహం చేసుకున్నాడు. 1998లో ఈ నటిని ఆయన వివాహం చేసుకున్నాడు. 2017లో వీరు విడిపోయారు. అప్పట్లో వీరి విడాకులు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ నటుడి రెండో పెళ్లి గురించి కూడా చాలా చర్చ జరిగింది. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ షూరా ఖాన్‌ని (Shura Khan) అతను రెండో పెళ్లి చేసుకున్నాడు.
2023 డిసెంబర్‌లో వీరి పెళ్లి జరిగింది. అయితే వీరి పెళ్లి అప్పట్లో వైరల్ అవ్వడానికి కారణం వీరి మధ్య వయసు. పెళ్లి సమయానికి అర్బాజ్ ఖాన్ వయసు 56 ఏళ్లు కాగా.. షూరా ఖాన్ వయసు 41 ఏళ్లు అంటే వీరిద్దరి మధ్య 15 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అప్పట్లో ఇది పెద్ద వార్తగా నిలిచింది. ప్రస్తుతం వీరి జటం సంతోషంగా గడుపుతోంది.

తాజాగా అర్బాజ్ ఖాన్ తన భార్యకు కొత్త లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. షురా ఖాన్‌కి మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్220d (Mercedes-Benz E220d) లగ్జరీ సెడాన్‌ని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర రూ .77.05 లక్షలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాక్స్‌లు, ఇన్సూరెన్స్‌తో కలిపి ఈ కారు ఆన్ రోడ్ ధర ముంబయిలో సుమారు రూ.93.17 లక్షలుగా ఉంది.
మెర్సిడెస్ బెంజ్ మోడళ్లలో దేశంలో అత్యంత విజయవంతమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఇ-క్లాస్ ఉంది. ఈ లగ్జరీ సెడాన్ ఆధునిక ఫీచర్లు, ఇంటీరియర్‌ని కలిగి ఉంటుంది. ఈ కారు అత్యుత్తమ టెక్నాలజీతో నిర్మించింది. నేచురల్ వాయిస్ కంట్రోల్, బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, MBUX కనెక్టెడ్ కార్ టెక్, డిజిటల్ కాక్పిట్ ఇన్‌స్ట్రూమెంట్ డిస్ప్లే ఉన్నాయి.

అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, మెర్సిడెస్ మీ కనెక్టెడ్ ఫీచర్లు, 360 డిగ్రీల కెమెరా, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులోని 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 200 bhp పవర్, 440 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తం 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
2.0-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పనిచేస్తే ఇది 197 bhp వద్ద 320 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన వేరియంట్లలో ఒకటైన 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో-డీజిల్ ఇ-క్లాస్ టాప్ వేరియంట్ 286 bhp వద్ద 600 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 6.1 సెకన్లలో అందుకుంటుంది.
ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ తన పాపులర్ ఇ-క్లాస్ లాంగ్ వీల్ బేస్ వెర్షన్‌ని భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కారు అధికారిక లాంచ్ అక్టోబర్ 9, 2024న జరగనుంది. ఆ తర్వాత వెంటనే ఈ లగ్జరీ సెడాన్ డెలివరీలు కూడా పూర్తవుతాయని జర్మన్ బ్రాండ్ ప్రకటించింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ .80 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








