లగ్జరీ కారు కోసం ఏకంగా సగం రెమ్యూనేషన్ ఖర్చు చేసిన అర్జున్ కపూర్..!
మార్కెట్లోకి కొత్త మోడల్ కారు విడుదల అయిందంటే చాలు కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు వెంటనే ఆ కారును కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెడుతుంటారు. ఈ లిస్ట్‌లో ప్రముఖ నటుడు అర్జున్ కపూర్(arjun kapoor) సైతం ఉంటారు. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్(Range Rover) నుంచి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన SUV 2024 కొత్త మోడల్ కారును కొనుగోలు చేసి తన కార్ల లిస్ట్‌లోకి చేర్చారు. ఈ మోడల్ పేరు 'రేంజ్ రోవర్ ఎల్‌డబ్యూబీ హెచ్‌ఎస్‌ఈ(Range Rover LWB HSE)'. దాదాపు రూ. 2.8 కోట్ల ధరతో ఈ సరికొత్త కారును కొనుగోలు చేశారు.
సాధారణంగా అర్జున్ కపూర్ మినిమం ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఈ లగ్జరీ కారు కోసం ఏకంగా సగానికి పైగా ఖర్చు పెట్టారు. ఇటీవల ముంబైలోని జుహూలో తన ఇంటి బయట తెల్లటి రేంజ్ రోవర్ కారు వద్ద అర్జున్ కపూర్ నిలబడి ఉన్న క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

రేంజ్ రోవర్ LWB HSE: అర్జున్ కపూర్ తీసుకున్న ఈ తెల్లటి రేంజ్ రోవర్ కారు చాలా మంది ఎంచుకునే కలర్. ఆయన సోదరి, నటి జాన్వీ కపూర్(janhvi Kapoor) కూడా ఇటీవల అదే కలర్‌లో రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. Range Rover LWB HSE వేరియంట్ ధర రూ. 2.36 కోట్లు (ఎక్స్-షోరూమ్). కానీ దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 2.8 కోట్ల వరకు ఉంటుంది.
ఇంజిన్, స్పెసిఫికేషన్స్: Range Rover LWB HSE వేరియంట్ 3.0-లీటర్ ఆరు-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 345 bhp వద్ద 700 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఈ కారులో వేరు వేరు డ్రైవింగ్ మోడ్ ఫంక్షన్‌లు ఉన్నాయి.

ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్: కారు ముందు సరికొత్త డిజైన్‌తో LED హెడ్‌లైట్‌లు, డోర్ హ్యాండిల్స్ వంటివి ఉన్నాయి. కారుల లోపల 13.1-ఇంచుల టచ్ డిస్‌ప్లే, 35 స్పీకర్లతో 1,600W మెరిడియన్ సిగ్నేచర్ సౌండ్ సిస్టమ్, 4-జోన్ క్లైమెట్ కంట్రోల్, 13.7 ఇంచుల మరో డిస్‌ప్లే ఉన్నాయి.
అర్జున్ కపూర్ SUV కలెక్షన్స్: ఈ సరికొత్త తెల్లటి రేంజ్ రేవర్ కారునే కాకుండా, కొన్ని ఇతర లగ్జరీ SUVలను కూడా కలిగి ఉన్నారు. ఆయన కార్ల కలెక్షన్‌లలో ప్రధాన హైలైట్ రూ. 4.5 కోట్ల మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ SUVని కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ నటులలో అర్జున్ కపూర్ ఒకరు.
ఈ GLS 600 మోడల్‌ను డిసెంబర్ 2021లో ఆయనకు డెలివరీ చేశారు. ఈ లగ్జరీ మెర్సిడెస్ మేబ్యాక్(Mercedes Maybach) GLS 600 SUV 4.0 లీటర్ల ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 558 bhp వద్ద 730 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు.
ఇదే కాకుండా గతంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110ని కూడా కొనుగోలు చేశారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్(Land Rover Defender) 110 ప్రత్యేకమైన SUV గ్రీన్ కలర్ షేడ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఆయన ఎంచుకున్న ఇంజిన్ ఆప్షన్ గురించిన వివరాలపై మాత్రం సమాచారం లేదు.
దీంతో పాటు అర్జున్ కపూర్ బ్లూ కలర్ మసెరటి లేవాంటే కారును కూడా తన గ్యారేజీలో ఉంచుకున్నారు. ఇది 3.0-లీటర్ V6 డీజిల్ ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. ఈ మోడల్ 271 bhp వద్ద 600 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అలాగే, అర్జున్ కపూర్ ఇటీవల సరికొత్త BGauss RUV350 అనే ఎలక్ట్రిక్ స్కూటర్(electric scooter)ను కూడా కొనుగోలు చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.09 లక్షల నుంచి రూ. 1.34 లక్షల వరకు ఉంటుంది. ఇది 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. టాప్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 120 కి.మీ రేంజ్ వరకు ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








