కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి దాదాపు చాలామందికి తెలుసు. టెలివిజన్ వ్యాఖ్యాతగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన సింగర్ గా కూడా పేరుపొందారు. తరువాత 'వికీ డోనర్' అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేశారు. తాజా సమాచారం ప్రకారం, నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇటీవల కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్ఎస్ 600 ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

ఇటీవల కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ 600 తో ఆయుష్మాన్ ఖురానా ఉన్న వీడియో వెలువడింది. ఈ వీడియోలో, ఆయుష్మాన్ ఖురానా ఈ లగ్జరీ ఎస్‌యూవీ నుండి దిగి, కొంతసేపు తర్వాత మల్లి కారులోకి ఎక్కడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేశారు, ఇది ఇప్పటివరకు వేలాది మంది చూశారు.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

ఇటీవల కాలంలో మరో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ కూడా కొత్త లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 తో కనిపించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇదివరకే తెలుసుకున్నాం. రణబీర్ సింగ్ కొత్త మేబాచ్ జిఎల్ఎస్ 600 ను కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బెంజ్ ఈ మధ్య కాలంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇది భారత మార్కెట్లో మేబాచ్ సిరీస్ యొక్క మొదటి కారు. బెంజ్ కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 50 యూనిట్లు మాత్రమే భారతదేశంలో విక్రయానికి అందుబాటులో ఉంచింది. ఇవి ఇప్పటికే పూర్తిగా అమ్ముడయ్యాయి.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

మెర్సిడెస్ బెంజ్ ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ. 2.43 కోట్లకు విడుదల చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి రేడియేటర్ గ్రిల్, 22 ఇంచెస్ మరియు 23 ఇంచెస్ స్పోక్ అల్లాయ్ వీల్స్, డి పిల్లర్ పై మేబాచ్ బ్రాండ్ లోగో, క్రోమ్ ఇన్సర్ట్ వంటివి ఉన్నాయి.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ సిరీస్ 4 మరియు 5 సీట్ల క్యాబిన్ ఎంపికలతో తీసుకురాబడింది. 4 సీట్ల వెర్షన్‌లో సెంటర్ కన్సోల్‌తో వస్తుంది, దీనిలో రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది. వెనుక భాగంలో 4 సీటర్లు మరియు 5 సీట్ల వెర్షన్లలో రిక్లైనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీని క్యాబిన్ అనేక ట్రిమ్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

బెంజ్ మేబాచ్ సిరీస్ 12.3 ఇంచెస్ MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మీస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్ మరియు డాష్‌బోర్డ్ నాప్ప లెదర్ తో ఉంటుంది. దీనికి మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇక ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్, స్పీడ్ కంట్రోల్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్, పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్ మరియు మసాజ్ సీట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

కొత్త లగ్జరీ కారులో కనిపించిన ఆయుష్మాన్ ఖురానా [వీడియో]

ఈ లగ్జరీ ఎస్‌యూవీ 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్‌తో జతచేయబడుతుంది, ఇది స్వల్పకాలికంలో అదనంగా 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Ayushmann Khurrana Ride Maybach GLS600 Super Luxury Suv. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X