భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద కర్వా చౌత్ శుభ సందర్భంగా తన భార్య సునీతా అహుజాకు ఓ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ (BMW 3 Series Gan Limousine) కారును బహుమతిగా ఇచ్చారు. గోవిందా తన భార్యకు ఇంతటి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి హస్బెండ్ నంబర్ 1 అని నిరూపించుకున్నాడు.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

ఈ సందర్భంగా, ఆయన తన భార్యకు కారును బహుమతిగా ఇస్తున్న చిత్రాలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఈ ఏడాది ప్రారంభంలోనే భారత మార్కెట్లో విడుదలైంది. ఇది ప్రస్తుతం, ఈ జర్మన్ కార్ బ్రాండ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ 3 సిరీస్ సెడాన్ యొక్క పొడవైన వీల్‌బేస్ వెర్షన్.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

ఈ కారు క్యాబిన్‌లో వెనుక సీటు ప్రయాణికుల కోసం ఎక్కువ స్థలం ఇవ్వబడింది. ఈ కారులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ల సౌకర్యాన్ని పెంచడానికి సస్పెన్షన్ సెటప్ సర్దుబాటు చేయబడింది. భారతదేశంలో, బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి (గ్రాన్ తురిస్మో) స్థానంలో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ తీసుకురాబడింది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

స్టాండర్డ్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ తో పోల్చుకుంటే, ఈ గ్రాన్ లిమోసిన్ వెర్షన్ 110 మిమీ పొడవైన వీల్‌బేస్‌ ను కలిగి ఉంటుంది. అంటే, దీని మొత్తం వీల్‌బేస్ పొడవు 2,961 మిమీ గా ఉంటుంది. కాగా, ఈ కారు మొత్తం పొడవు 4,819 మిమీ, అంటే ఈ సెడాన్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే 28 మి.మీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

పెరిగిన కొలతల కారణంగా, స్టాండర్డ్ 3 సిరీత్ పోల్చుకుంటే, ఈ గ్రాన్ లిమోసిన్ మోడల్ క్యాబిన్ లోపల 43 మిమీ ఎక్కువ స్థలాన్ని పొందుతుంది. ఈ కారులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటుగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారులో లభించే ఇతర ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివితో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, 3డి నావిగేషన్, రియర్‌ పార్క్ అసిస్ట్, 16 స్పీకర్ హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ పవర్, టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇది 255 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో అనుసంధనం చేయబడి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ను ఈ ఏడాది జనవరి నెలో దేశీయ విపణిలో విడుదల చేశారు. మార్కెట్లో ఈ లగ్జరీ సెడాన్ ధర రూ. 53.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంచబడింది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

ఈ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ల డీజిల్ ఇంజన్ ఆప్షన్ ను కూడా అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ కూడా స్టాండర్డ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తోనే లభిస్తుంది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇటీవలే భారత విపణిలోని తమ కార్ల ధరలను భారీగా పెంచింది. ఈ నెలలో బిఎమ్‌డబ్ల్యూ కార్లు సుమారు రూ. 8 లక్షల వరకు పెరిగాయి. కంపెనీ విక్రయిస్తున్న 3 సిరీస్, 2 సిరీస్ గ్రాన్ కూపే, 5 సిరీస్, 6 సిరీస్ GT, 7 సిరీస్, M5, X1, X3, X4, X5, X5 M, X6, X7 మరియు Z4 కార్ల ధరలను పెంచింది.

భార్యకు కళ్లు చెదిరిపోయే ఖరీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో!

BMW 530i M Sport Carbon Edition విడుదల - వివరాలు

బిఎమ్‌డబ్లు ఇండియా తాజాగా దేశీయ మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎమ్ స్పోర్ట్ కార్బన్ ఎడిషన్ (BMW 530i M Sport Carbon Edition) పేరిట కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త సెడాన్ ధర రూ. 66.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. పేరుకు తగినట్లుగానే ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్స్ లో కార్బన్ డీటేలింగ్స్ కనిపిస్తాయి. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Bollywood actor govinda gifts bmw 3 series gran limousine to his wife
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X