బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం గురించి కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన జాన్ అబ్రహం కు సూపర్ బైక్ ల పట్ల ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా, ఆయన బైక్ కలెక్షన్ ను మరియు రైడింగ్ తీరును చూపించే ఓ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో విడుదలైంది. ఆ వివరాలేంటో మనం కూడా చూద్దాం రండి.

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ లో చాలా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని బడ్జెట్ మోటార్‌సైకిళ్లు మొదలుకొని అత్యంత ఖరీదైన లగ్జరీ మోటార్‌సైకిళ్ల వరకు అన్నీ ఆయన వద్ద ఉన్నాయి. అంటే, కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ మొదలుకొని డ్యుకాటి పానిగేల్‌ వరకూ అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలు మన హీరో వద్ద ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

జాన్ అబ్రహం వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను బయటి ప్రపంచానికి చూపించేందుకు వాకర్ ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇందులో జాన్ అబ్రహం కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14ఆర్ బైక్ ను నడుపుతున్న దృశ్యాలను మరియు అతని గ్యారేజీలో ఉన్న ఇతర బైక్ ల వివరాలను వీడియోలో చూపించారు.

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

కవాసకి నింజా జెడ్ఎక్స్-14ఆర్

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం వద్ద ఉన్న అత్యంత ఖరీదైన బైక్ లలో ఒకటి మరియు అతను ఎక్కువగా నడపడానికి ఇష్టపడే బైక్ లలో ఒకటి కవాసకి నింజా జెడ్ఎక్స్-14ఆర్. ఇదొక సూపర్ స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిల్. భారత మార్కెట్లో ఈ బైక్ విలువ సుమారు రూ. 19.7 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వీడియోలో కూడా జాన్ అబ్రహం ఈ బైక్ నడుపుతూ కనిపిస్తాడు.

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

ఈ సందర్భంగా జాన్ అబ్రహం మాట్లాడుతూ.. తనకు నడవడం కంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణించడమే ఎక్కువ ఇష్టమని చెప్పాడు. అదే సమయంలో, తాను ఎప్పుడూ తక్కువ వేగంతో మాత్రమే ద్విచక్ర వాహనం నడుపుతానని, ఎక్కువ వేగంతో ప్రయాణించనని చెప్పాడు. అంతేకాకుండా, ద్విచక్రవాహనదారులు అందరూ కూడా హెల్మెట్ ధరించి రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఈ వీడియోలో కూడా వాకర్ మరియు నటుడు జాన్ అబ్రహం ఇద్దరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడిపారు.

జాన్ అబ్రహం ఒక సర్టిఫైడ్ సూపర్ బైక్ రైడర్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జాన్ అబ్రహం ఒక సర్టిఫైడ్ సూపర్ బైక్ రైడర్. ఇందుకోసం అతను కాలిఫోర్నియాలోని సూపర్ బైక్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. ద్విచక్రవాహనాలపై ఉన్న మక్కువతోనే తాను ఈ సర్టిఫికేషన్ చేశారు. జాన్ అబ్రహం కేవలం రేసింగ్ ట్రాక్‌లపై మాత్రమే అధిక వేగంతో టూవీలర్లను నడపుతానని, పబ్లిక్ రోడ్లపై ప్రభుత్వం నిర్దేశించిన వేగంతో ప్రయాణిస్తానని చెప్పాడు.

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

పదికి పైగా సూపర్‌బైక్‌లు

జాన్ అబ్రహం గ్యారేజ్ లో పదికి పైగా సూపర్ బైక్‌ లు ఉన్నాయి. వీటిలో యమహా V-MAX, హోండా CBR1000RR-R, యమహా YZF-R1, డుకాటి పానిగేల్, MV ఆగస్టా F3 M3 800, KTM 390 డ్యూక్, BMW S1000RR, అప్రిలియా RSV4 RF, డుకాటి డయావెల్, సుజుకి GSX-1000R మరియు సుజుకి హయబుసా వంటి ఎన్నో సాధారణ మరియు సూపర్ బైక్ లు ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం బైక్ గ్యారేజ్ చూసొద్దాం రండి..

మన హీరో గారి గ్యారేజ్ లో సాధారణ సరసమైన మోటార్‌సైకిళ్లు మాత్రమే కాకుండా, అనేక కస్టమైజ్డ్ బైక్‌లు కూడా ఉన్నాయి. వీటిలో యమహా RD350, KTM 390 డ్యూక్, రాజ్‌పుతానా కస్టమ్స్ లైట్‌ఫుట్, బుల్ సిటీ కస్టమ్స్ అకుమా, యహామా FZ V2 మొదలైనవి ఉన్నాయి. జాన్ అబ్రహం యమహా ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలినదే.

Most Read Articles

English summary
Bollywood actor john abraham bike collection showed in a video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X