కార్తిక్ ఆర్యన్ కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే అవాక్కవుతారు
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేర్లలో ఒకటి'కార్తిక్ ఆర్యన్'. సినిమాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను కలిగిన ఈయన ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటీవల మరో కొత్త కారు కొన్నారు.
ఇప్పటికే లెక్కకు మించిన కార్లు మరియు బైకులు కలిగి ఉన్న కార్తిక్ ఆర్యన్ గ్యారేజిలో సరికొత్త 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్' ఎస్‌యూవీని చేర్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కార్తిక్ ఆర్యన్ తన పెంపుడు కుక్కతో కలిసి కారుకు పూజ చేయడం చూడవచ్చు. కార్తిక్ ఆర్యన్ కొన్న కొత్త రేంజ్ రోవర్ ధర రూ. 4.47 కోట్లు.

కార్తిక్ ఆర్యన్ టాప్ ఎండ్ మోడల్ రేంజ్ రోవర్ SV LWB కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి 2022లో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు మరియు ప్రముఖుల గ్యారేజిలో స్థానం సంపాదించేసింది. కాగా ఇప్పుడు రేంజ్ రోవర్ కారు కలిగిన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ కూడా ఒకరుగా చేరారు.
కార్తిక్ ఆర్యన్ కొనుగోలు చేసిన కొత్త కారు డీప్ ఎమరాల్డ్స్ గ్రీన్ షేడ్‌లో చూడచక్కగా ఉంది. అయితే ఈ కారు డెలివరీ డీలర్‌షిప్ వద్ద కాకుండా నటుడి ఇంటి దగ్గరే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి కారణం డీలర్‌షిప్ వద్ద ఎక్కువ రద్దీ ఏర్పడుతుంది, దానిని నివారించడానికే అని తెలుస్తోంది. అయితే గతంలో కార్తిక్ ఆర్యన్ లంబోర్ఘిని, మినీ కూపర్ కొనుగోలు చేసినప్పుడు నేరుగా డీలర్‌షిప్‌కి వెళ్ళాడు.
ఇక కార్తిక్ ఆర్యన్ యొక్క కొత్త రేంజ్ రోవర్ విషయానికి వస్తే.. ఇది స్పెసిఫిక్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది. ఎల్ఈడీ లైట్స్, 22 ఇంచెస్ డైమండ్ టర్న్డ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం స్కఫ్ ప్లేట్స్, మెటల్ పెడల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిఫ్రిజిరేటర్, 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్స్ ఉంటాయి.
ఇక్కడ కనిపించే కారు LWB వెర్షన్ కాబట్టి.. ఇది విశాలమైన క్యాబిన్ పొందుతుంది. ఈ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 bhp పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

కార్తిక్ ఆర్యన్ కార్లు మరియు బైకులు
నటుడు కార్తిక్ ఆర్యన్ గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు చాలానే ఉన్నాయి. ఇందులో మినీ కూపర్, లంబోర్ఘిని ఉరుస్, మెక్‌లారెన్ జీటీ, మరియు బీఎండబ్ల్యూ 5 సిరీస్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ కూడా యాడ్ అయ్యింది. అంతే కాకుండా ఇతని గ్యారేజిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మరియు డుకాటీ స్క్రాంబ్లర్ 1100 వంటి బైకులు ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








