కోట్లు విలువైన కార్లు వదిలి మెట్రోలో కనిపించిన బాలీవుడ్ స్టార్ (వీడియో)
సాధారణంగా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రముఖులు లగ్జరీ కార్లలో ప్రయాణిస్తారని అందరికి తెలుసు. అయితే ఇటీవల ఓ బాలీవుడ్ స్టార్ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నటుడు కార్తీక్ ఆర్యన్ మెట్రోలో ప్రయాణించడం చూడవచ్చు. 'కార్తీక్ ఆర్యన్'ను గుర్తించిన వారిలో కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడం చూడవచ్చు. ముంబైలో ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి కార్తిక్ ఆర్యన్ మెట్రోలో ప్రయాణిస్తున్నారు అని ఇన్‌స్టంట్ బాలీవుడ్ వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ వీడియో షేర్ చేశారు. ఇది ఎంతో మంది అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కార్తీక ఆర్యన్ ముఖానికి మాస్క్ వేసుకుని డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. అభిమానులు సెల్ఫీ తీసుకునే క్రమంలో స్టేషన్ వస్తోంది అని చెప్పడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. ఫోటోలు తీసుకోవడంలో పది దిగాల్సిన స్టేషన్ మర్చిపోతారేమో అని బహుశా ఇలా అని ఉండవచ్చని సమాచారం. అయితే చాలామంది సెల్ఫీల కోసం ఎగబడటం ఇక్కడ చూడవచ్చు.
ఎప్పుడు ఖరీదైన లంబోర్ఘిని కారులో కనిపించే కార్తీక ఆర్యన్ ఒక్కసారిగా సాధరణ పౌరుల మాదిరిగా మెట్రోలో కనిపించడంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. నగరం ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వల్ల కార్తీక్ ఆర్యన్ ఇలా మెట్రోలో ప్రయాణించి ఉండవచ్చు. విపరీతమైన ఎండ సమయంలో ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించడానికి చాలామంది సుముఖత చూపుతున్నారు. దీంతో ఇప్పుడు మెట్రోలో ప్రయాణించేవారిసంఖ్య భారీగా పెరిగింది.

స్థానిక రైళ్లను ముంబై యొక్క లైఫ్ లైన్ అని పిలుస్తారు. ఆధునిక కాలంలో మెట్రో చాలా మంచి ప్రయాణ అనుభూతిని అందించడమే కాకుండా చాలా సౌకర్యవంతమైనదిగా ఉంటుంది. ఈ కారణంగా చిన్న దూరాలకు కూడా ప్రజలు మెట్రో ఎంచుకుంటున్నారు. మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించిన నటుల జాబితాలో చాలామంది ఉన్నారు. కార్తీక్ ఆర్యన్ మాత్రమే కాకుండా గతంలో అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ మొదలైన వారు కూడా ఉన్నారు.
గతంలో బాలీవుడ్ నటుడు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. అయితే కార్తీక్ ఆర్యన్ విషయంలో జరిగినట్లు సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడలేదు. ఎందుకంటే ఆయన ముఖానికి మాస్క్ వేసుకున్నారు. తలకు క్యాప్ ధరించారు. కాబట్టి ఆయనను ఎవరూ పెద్దగా గుర్తించలేకపోయారు. దీంతో ఎవరూ సెల్ఫీల కోసం ఆయన దగగ్రకు వెళ్ళలేదు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హృతిక్ రోషన్ కూడా ఖరీదైన కార్లను వదిలేసి మెట్రోలో ప్రయానించిన సంఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా అనిల్ కపూర్, కియారా అద్వానీ మరియు వరుణ్ ధావన్ కూడా మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. గత ఏడాది నటి హేమమాలిని కూడా మెట్రోల్ ప్రయాణిస్తూ కనిపించారు. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా చాలామంది రాజకీయ నాయకులు కూడా మెట్రోలో ప్రయాణించిన సంఘటనలు కోకొల్లలు అనే చెప్పాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








