బాలీవుడ్ స్టార్ కోసం కొత్త బైక్.. చూడగానే ఫిదా అవుతున్న బైక్ లవర్స్!
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు ఇటీవల జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ ఓ ప్రత్యేకమైన యెజ్డీ రోడ్‌స్టర్‌ను గిఫ్ట్‌గా అందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బైక్ దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొత్త డ్యూయెల్ పెయింట్ స్కీమ్ పొంది ఉండటం చూడవచ్చు. దీనిని కంపెనీ రాజ్‌కుమార్ రావు చిత్రాలలో ఒకటైన గన్స్ మరియు గులాబ్స్‌కి గుర్తుగా అందించినట్లు సమాచారం. ఈ కారణంగానే సినిమా పేరు బైక్ యొక్క రియర్ మడ్‌గార్డ్‌పై మరియు రోడ్‌స్టర్ బ్యాడ్జ్ ప్రదర్శించబడే సైడ్ ప్యానెల్ మీద కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
వీడియో యెజ్డీ మోటార్‌సైకిల్స్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇందులో రాజ్‌కుమార్ రావు బైక్ డెలివరీ పొందటం చూడవచ్చు. బైకు మీద ఉన్న గుడ్డ తొలగించడం, బైక్ స్టార్ట్ చేయడం వంటివి చూడవచ్చు. నిజానికి ఈ బైకును కంపెనీ ఈయన కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది ఇతర బైకుల కంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి.

ప్రత్యేకమైన కస్టమ్ జావా యెజ్డీ రోడ్‌స్టర్ బైక్ ప్రత్యేకమైన బ్రౌన్ అండ్ క్రోమ్ డ్యూయల్ టోన్ కాంబోలో ఉండటం చూడవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ మరియు హెడ్‌లైట్ రింగ్‌లో మాత్రమే క్రోమ్ చూడవచ్చు. ఇంజిన్, ఎగ్జాస్ట్ మరియు ఫ్రేమ్ వంటి మిగిలిన భాగాలు అన్నీ బ్లాక్‌అవుట్ చేయబడి ఉండటం గమనించవచ్చు. ఇరువైపులా ఎయిర్ ఫిల్టర్ బాక్స్‌పై కస్టమ్ గన్ డిజైన్‌ను గమనించవచ్చు. రియర్ మడ్‌గార్డ్‌పై కూడా గన్స్ అండ్ గులాబ్స్ చూడవచ్చు.
బైక్ డెలివరీ పొందిన తరువాత రాజ్‌కుమార్ రావు మాట్లాడుతూ.. ఇప్పుడు నేను కూడా యెజ్డీ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ ఓనర్ అయ్యాను. ఇది చాలా గర్వంగా ఉందని అన్నారు. అంతే కాకుండా బైక్ తనకు చాలా నచ్చిందని, కలర్ స్కీమ్ అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఆ తరువాత ఆవరణలోనే బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. మొత్తానికి బాలీవుడ్ స్టార్ మనసును ఆ బైక్ దోచేసింది తెలుస్తోంది.

జావా యొక్క యెజ్డీ రోడ్‌స్టర్ బైక్ 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ డీఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 28 Bhp పవర్ మరియు 29.4 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. రోజువారీ ప్రయాణానికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
జావా యెజ్డీ రోడ్‌స్టర్ బైక్ 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి సుమారు 194కేజీల బరువు ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.4లీటర్లు. సీటు ఎత్తు కూడా 790 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఈ బైక్ చాలా మంది రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ యొక్క ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన బైకుల జాబితాలో జావా యెజ్డీ రోడ్‌స్టర్ కూడా ఒకటి. ఎక్కువమంది యువత ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం సింపుల్ డిజైన్, అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. ఈ బైక్ ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్‌లు మరియు పొడవైన హ్యాండిల్ బార్ వంటివి పొందుతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








