లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌ మంచి నటుడుగా పేరు పొందాడు. అతడు కొన్ని బాలీవుడ్ చిత్రాలతో పాటు అనేక టీవీ సీరియళ్లలో తన నటనలో మంచి ప్రావీణ్యం పొందాడు. ఈ కారణంగా అతను దేశంలోని చాలా మంది అభిమానులను కలిగి ఉన్నాడు. ఇటీవల ఇతనికి సంబంధించి ఒక కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

ఏక్తా కపూర్‌ నిర్మించిన ఘర్‌ ఏక్‌ మందిర్‌తో అతడి కెరీర్‌ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్‌తే హై సీరియల్‌తో పెద్ద బ్రేక్‌ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్‌ వినోద్‌, స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌, హమ్‌షకల్స్‌, ఉడాన్‌, థప్పడ్‌ వంటి సినిమాల్లో రామ్‌ కపూర్‌ నటించాడు.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

నివేదికల ప్రకారం, ఇటీవల రామ్ కపూర్ కొత్త పోర్స్చే 911 కరెరా ఎస్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం 1.84 కోట్ల రూపాయలు. రామ్ కపూర్ కొనుగోలు చేసిన ఈ కారు బ్లూ కలర్ లో ఉంటుంది. ఈ కారుకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలువడ్డాయి.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

ఈ ఫోటోలను పోర్స్చే ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. రామ్ కపూర్ ఈ కొత్త పోర్స్చే 911 కరెరా ఎస్ మాత్రమే కాకుండా, చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఈ కార్లలో బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎంజి వంటివి కూడా ఉన్నాయి.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

కార్లు మాత్రమే కాకుండా, రామ్ కపూర్ కూడా రైడింగ్ బైక్‌లను కూడా ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ కారణంగా అతనికి హార్లే డేవిడ్సన్, బిఎమ్‌డబ్ల్యూ జిఎస్ మరియు ఇండియన్ మోటార్‌సైకిల్ వంటి వాటిని కూడా కలిగి ఉన్నాడు.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

రామ్ కపూర్ కొనుగోలు చేసిన పోర్స్చే 911 కరెరా ఎస్ విషయానికి వస్తే, ఇది బేస్ కారెరా వేరియంట్ యొక్క అత్యంత శక్తివంతమైన వేరియంట్. ఇది 3.0-లీటర్ ఫ్లాట్-సిక్స్ బాక్సర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 450 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

పోర్స్చే 911 కరెరా ఎస్ లగ్జరీ కారు 308 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ పవర్ ఫుల్ ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది వెనుక చక్రాలకు శక్తినిస్తుంది. ఇది కాకుండా, ఈ కారులో స్టీరింగ్ వీల్ వెనుక పాడిల్ షిఫ్టర్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

లగ్జరీ కార్ కొన్న బుల్లితెర నటుడు రామ్‌ కపూర్‌; వివరాలు

ఈ కారు పూర్తిగా భిన్నమైన రియర్-ఇంజిన్ లేఅవుట్‌ను పొందుతుంది, ఇది వెనుక చక్రాలకు పైన అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్లు కారు చక్రాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తాయి, దీనివల్ల మంచి ట్రాక్షన్ వస్తుంది. ఇది 20 ఇంచెస్ ఫ్రంట్ మరియు 21 ఇంచెస్ రియర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

Most Read Articles

English summary
Ram Kapoor Buys A Porsche 911 Carrera S. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X