అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

బాలీవుడ్ చిత్ర సీమలోని ప్రముఖ నటులలో ఒకరు రణదీప్ హూడా (Randeep Hooda). రణదీప్ హూడా తన నటనా జీవితంలో ప్రత్యేకమైన మరియు అసాధారణ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. నటనా జీవితం మాత్రమే కాకుండా అతడు కొన్ని ప్రతేకమైన కార్లను కూడా కలిగి ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మరో కొత్త కారుని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

సాధారణంగా బాలీవుడ్ ప్రముఖులు Mercedes Maybach GLS మరియు Lamborghini Urus వంటి విలాసవంతమైన మరియు అన్యదేశ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ రణదీప్ హోడా మాత్రం ఒక అరుదైన కారుని తన గ్యారేజీలో చేర్చారు. నటుడు హూడా ఇటీవల తన గ్యారేజీలో చేర్చిన కారు బేర్-బోన్స్ పాతకాలపు 4×4 విల్లీస్ జీప్‌ (4×4 Willys Jeep). దీనిని ఇందులో చూడవచ్చు.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

నటుడు రణదీప్ హూడా ఇటీవల పంజాబ్‌లోని మోగాలో తన షూటింగ్ లొకేషన్‌లలో తన లేటెస్ట్ కార్ నడుపుతూ కనిపించారు. అతను కొనుగోలు చేసిన ఈ ఓపెన్-టాప్ 4×4 విల్లీస్ జీప్ క్యామెల్ బీజ్ (ఒంటె లేత గోధుమరంగు) కలర్ లో చాలా వరకు కష్టమైజ్ చేయబడింది. మొత్తానికి ఈ విల్లీస్ జీప్ దాని యదార్ధ స్థితికి పునరుద్ధరించబడింది, దీనికోసం ఇందులో అనేక ఎలిమెంట్స్ ఉపయోగించబడ్డాయి.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

4×4 Willys Jeep చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ట్రెడిషినల్ వార్ డికాల్స్, ముందు బంపర్‌పై అమర్చిన అదనపు లైట్లు మరియు రోప్ మౌంట్, ఇరుకైన మరియు నాబీ ఆఫ్-రోడ్ టైర్లు, సైడ్ బాడీపై అమర్చిన పారలు మరియు గొడ్డళ్లు మరియు పునరుద్ధరించిన గేజ్‌లు మరియు సీట్ కవర్లు ఉన్నాయి.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

ఇటీవల రణదీప్ హుడా తన తాజా రైడ్ గురించి కూడా సమాచారం అందించారు. విల్లీస్ జీప్‌ను సొంతం చేసుకోవాలనేది తన చిన్ననాటి కల అని చెప్పారు. ఈ జీప్ కోసం గత 30 ఏళ్లుగా తాను కలలు కంటున్నానని కూడా చెప్పారు. అతను చిన్నతనంలో సైనిక వాహనాల స్కేల్ మోడల్‌లతో ఆడుకునేటప్పుడు విల్లీస్ జీప్‌ను సొంతం చేసుకోవాలనే అతని కల పుట్టింది. అందువల్లనే ఇప్పటికి కూడా జీప్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

విల్లీస్ జీప్‌ని సొంతం చేసుకునేందుకు అతనిని ప్రధానంగా ఆకర్షించిన అంశాలు దాని సరళత, మినిమలిజం మరియు మన్నిక. ఇది చూడగానే ఆకర్షించే విధమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చూడడానికి మరింత ప్రాచీనమైనదిగా ఉంటుంది. ఇటీవల తన కొత్త విల్లీస్ జీప్‌లో తన మొదటి లాంగ్ డ్రైవ్ గురించి కూడా హూడా వివరించాడు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని అందించిందని కూడా చెప్పుకొచ్చారు.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

విల్లీస్ జీప్ లో చేసిన డ్రైవింగ్ అనుభవం నిజంగానే తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి అందించిందని చెప్పారు. మొదటి లాంగ్ డ్రైవ్‌లో, అతను దానిని 120 కి.మీ ప్రయాణించారు. విల్లీస్ జీప్‌ను కొనుగోలు చేయడం తనకు మరింత ప్రత్యేకం అని రణదీప్ హుడా చెప్పాడు. ఇప్పటి వరకూ తన కుటుంబంలోని వారు గాని లేదా స్నేహితులు గాని ఎవరూ ఇటువంటి కారుని కొనుగోలు చేయలేదని చెప్పారు.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

రణదీప్ హోడా కొనుగోలుచేసిన ఈ కొత్త విల్లీస్ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది సుదూర ప్రయాణాలకు అంత సౌకర్యంగా ఉండదు. కావున రణదీప్ హూడా వారాంతాల్లో అడవి ప్రయాణాలకు ఈ జీప్‌ను ఉపయోగిస్తానాని తెలిపారు. కొత్త విల్లీస్ జీప్‌తో పాటు, రణదీప్ హుడా మెర్సిడెస్-బెంజ్ GLS SUVని కూడా ఇప్పటికే కలిగి ఉన్నారు.

రణదీప్ హోడా కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, గుర్రపు స్వారీ చేయడంలో కూడా దిట్ట. హూడా రెండు స్టార్‌డస్ట్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ మరియు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులను సొంతం చేసుకున్నారు. మొదట హుడా మీరా నాయర్ యొక్క మాన్‌సూన్ వెడ్డింగ్ తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' అనే చిత్రంలో పాపులర్ అయ్యాడు.

అరుదైన Willys Jeep కొనుగోలు చేసిన రణదీప్ హూడా: ఇది నిజంగానే అరుదైన కారు.. మీరు చూసారా..!!

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎక్కువమందికి విలాసవంతమైన లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. చాలామంది యాక్టర్స్ బెంజ్, లంబోర్ఘిని వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. అయితే విల్లీస్ జీప్ వంటివి ఎవరూ ఎక్కువగా కొనుగోలు చేయలేదు. విల్లీస్ జీప్ వంటివి చాలా అరుదుగా కొనుగోలు చేస్తూ ఉంటారు.

Most Read Articles

English summary
Bollywood actor randeep hooda buys new vintage willys jeep details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X