MG Comet ఎలక్ట్రిక్ కారును కొనుగోలుచేసిన ప్రముఖ నటుడు.. సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్న EV ఫీచర్లు ఏంటి?
ఎలక్ట్రిక్ కార్ల వైపు భారతీయులు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు నుంచి సెలబ్రిటీల వరకు ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే పలువులు ప్రముఖులు తాము కొనుగోలు చేసిన ఈవీల ఫోటోలను షేర్ చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ (Actor Rohit roy) ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ప్రస్తుతం దేశంలోనే సరసమైన ఈవీగా పేరుగాంచింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) ఫోటోలను రోహిత్‌రాయ్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌పై అతని అభిమానులు స్పందించారు. రోహిత్ రాయ్‌ను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఎంజీ కామెట్ రెండు డోర్ల మాత్రమే కలిగిన 4 సీటర్ వాహనం. ప్రస్తుతం ఈ ఈవీ ధర రూ.7.89 లక్షల నుంచి రూ.9.98 లక్షల (ఎక్స్‌షోరూం) గా ఉంది.

3 వేరియంట్లలో లభిస్తుంది : ఎంజీ కామెట్ ఈవీ 2-డోర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో 4 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఎంజీ కామెట్.. పేస్, ప్లే, ప్లష్ వేరియంట్లలో లభిస్తుంది. క్యాండీ వైట్, అరోరా సిల్వర్ సహా 2 డ్యూయల్ టోన్ మరియు మోనోటోన్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కి.మీ రేంజ్ : ఎంజీ కామెట్ EV 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ వాహనంలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 41.42bhp శక్తి మరియు 110 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌తో 230 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ కారు బ్యాటరీని 3.3Kw ఛార్జర్ ఉపయోగించి 7 గంటల్లో ఛార్జింగ్ చేయవచ్చు.
మెరుగైన ఫీచర్లు : ఎంజీ కామెట్ ఈవీ LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25 అంగుళాల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 55 వరకు కనెక్టెట్ కారు ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు కీలెస్ ఎంట్రీ వంటి పీచర్లను కలిగి ఉంటుంది.
MG కామెట్ EV డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరాలు, దీంతోపాటు అరుదైన పార్కింగ్ సెన్సార్‌లతో భద్రతపరంగా మెరుగ్గా పనిచేస్తుంది. ఈ కారు టాటా టియాగో EV మరియు సిట్రస్ EC3 వాహనాలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
ఇటీవల రోహిత్ రాయ్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. హెల్మెట్ లేకుండా బాబర్ బైక్‌ను నడపడంపై నెటిజన్లు ఆగ్రహం వ్కక్తం చేశారు. దీనిపై నటుడు స్పందించారు. వీడియో తీసేందుకు ఇంటి చుట్టు బైక్‌ను నెమ్మదిగా నడిపినట్లు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో రోహిత్ రాయ్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








