కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ నిస్సాన్‌ పెట్రోల్‌ SUVలో ఎయిర్‌పోర్టుకు సల్మాన్‌ ఖాన్‌.. దబాంగ్‌ కారు ఫీచర్స్ అదుర్స్

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌(Salman Khan) ఇటీవల ఎక్కువగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. అందుకు కారణం ఈ బ్యాచ్‌లర్‌కి హత్య బెదిరింపు కాల్స్‌ రావడమే.. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ తన కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ నిస్సాన్‌(Bulletproof Nissan SUV) పెట్రోల్‌ లగ్జరీ కారులో ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించారు.

బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌(Salman Khan) ఇటీవల ముంబయిలోని ఓ ప్రైవేట్ విమానాశ్రయంలో కనిపించారు. సల్మాన్‌ తాను కొత్తగా కొనుగోలు చేసిన బుల్లెట్‌ ప్రూఫ్‌ నిస్సాన్‌ పెట్రోల్‌ ఎస్‌యూవీలో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే ఈ కారు కొనుగోలు చేయకముందు సల్మాన్‌ ఎక్కువగా బుల్లెట్ ప్రూఫ్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200 లో బయటకు వచ్చేవారు.

Salman-Khan-Bulletproof-Nissan-Patrol-SUV

సల్మాన్‌ నిస్సాన్‌ పెట్రోల్‌ కారుకు ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేశారు. సల్మాన్ మూడు కార్ల కాన్వాయ్ విమానాశ్రయానికి చేరుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. మొదటి కారు టయోటా ఫార్చూనర్‌లో పర్సనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ ఉండగా.. రెండో కారు బుల్లెట్‌ ప్రూఫ్‌ నిస్సాన్‌ పెట్రోల్ కారులో సల్మాన్‌, మూడవ కారు మహీంద్రా బొలెరో నియోలో పోలీసు అధికారులు ఎయిర్‌పోర్టుకు వచ్చారు.

ముంబయి ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టు బయట బుల్లెట్‌ ప్రూఫ్‌ నిస్సాన్‌ పెట్రోల్‌(Nissan Patrol SUV) SUV లో నుంచి సల్మాన్‌ దిగిన అనంతరం ఆయన ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. అయితే సల్మాన్ ఇంత మంది సెక్యూరిటీ గార్డులతో బయటకు వస్తుండటంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Salman-Khan-Bulletproof-Nissan-Patrol-SUV

బాలీవుడ్ సెలబ్రిటీలందరిలోనూ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ సల్మాన్ ఖాన్‌కే పోలీసులు అధిక భద్రత కల్పిస్తున్నారు. ఇందుకు కారణమేమంటే.. ప్రముఖ పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యలో ప్రధాన క్రిమినల్ సూత్రధారి నుంచి సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు రావడమే.

కాగా ఇప్పుడు సల్మాన్‌ వాడుతున్న నిస్సాన్‌ పెట్రోల్‌ SUV విషయానికొస్తే ఈ కారును మిడిల్‌ ఈస్టర్న్‌ మార్కెట్‌ నుంచి భాయిజన్‌ ప్రైవేట్‌గా దిగుమతి చేసుకున్నారు. ఇది జపనీస్‌ ఫ్లాగ్‌షిప్‌. దురదృష్టవశాత్తు ఈ కారును భారత మార్కెట్లో విక్రయించడం లేదు. ఈ కారు గల్ఫ్‌ దేశాలు, ఆగ్నేయాసియా దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది.

Salman-Khan-Bulletproof-Nissan-Patrol-SUV

అంతర్జాతీయ మార్కెట్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ కొనుగోలు చేయాలనుకున్న సెలబ్రిటీలు, ప్రముఖులకు నిస్సాన్ పెట్రోల్‌ SUV బెస్ట్‌ ఆప్షన్స్‌లో ఒకటి. అయితే ఈ SUV యొక్క ఖచ్చితమైన బుల్లెట్ ప్రూఫ్ సేఫ్టీ లెవెల్స్‌ గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. నిస్సాన్ పెట్రోల్ కారు ఒకే సమయంలో భద్రత మరియు లగ్జరీ రైడ్ రెండింటినీ అందిస్తుంది. దీంతో భారత్‌లోనూ ఈ కారుకు అభిమానులు పెరుగుతున్నారు.

ఇక పవర్‌ట్రెయిన్‌ విషయానికొస్తే నిస్సాన్ పెట్రోల్ కారు 5.6 లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 405 హెచ్‌పీ పవర్ వద్ద 560 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 4-వీల్ డ్రైవ్ కెపాబిలిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కారు గ్లోబల్ మార్కెట్లో 4.0 లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్ ఎంపికను కూడా అందిస్తోంది.

Salman-Khan-Bulletproof-Nissan-Patrol-SUV

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 4, 2023, 12:27 [IST]
English summary
Bollywood actor salman khan arrived at the mumbai airport in his bulletproof nissan patrol suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+