చౌకైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన ప్రముఖ నటుడు.. ఏంటీ కారు ప్రత్యేకత?
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడుగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఈ నటుడికి కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే అనేక లగ్జరీ కార్లతో కూడిన గ్యారేజీని కలిగి ఉన్నాడు. ఇప్పటికే సునీల్ శెట్టి మెర్సిడెస్ బెంజ్ GLS 350, హమ్మర్ H2, BMW X5, జాగ్వార్ XF, జీప్ రాంగ్లర్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.
MG కామెట్.. లవ్ ఇట్: తాజాగా ఈ నటుడు MG కామెట్ EVను (MG Comet EV) కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను సునీల్ శెట్టి ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 'MG కామెట్.. లవ్ ఇట్' అనే క్యాప్షన్‌ను పెట్టారు. ప్రస్తుతం ఈ ఈవీ ధర రూ.7.89 లక్షల నుంచి రూ.9.98 లక్షల (ఎక్స్‌షోరూం) గా ఉంది.

3 వేరియంట్లలో లభిస్తుంది : ఎంజీ కామెట్ ఈవీ 2-డోర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో 4 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ ఈవీ పేస్, ప్లే, ప్లష్ వేరియంట్లలో లభిస్తుంది. క్యాండీ వైట్, అరోరా సిల్వర్ సహా 2 డ్యూయల్ టోన్ మరియు మోనోటోన్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
సింగిల్ ఛార్జింగ్‌తో 230 కి.మీ రేంజ్ : ఎంజీ కామెట్ EV 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ వాహనంలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 42PS శక్తి మరియు 110 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌తో 230 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ కారు బ్యాటరీని 3.3Kw ఛార్జర్ ఉపయోగించి 7 గంటల్లో ఛార్జింగ్ చేయవచ్చు.

మెరుగైన ఫీచర్లు : ఎంజీ కామెట్ ఈవీ LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25 అంగుళాల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 55 వరకు కనెక్టెట్ కారు ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు కీలెస్ ఎంట్రీ వంటి పీచర్లను కలిగి ఉంటుంది.
MG కామెట్ EV డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరాలు, దీంతోపాటు అరుదైన పార్కింగ్ సెన్సార్‌లతో భద్రతపరంగా మెరుగ్గా పనిచేస్తుంది. ఈ కారు టాటా టియాగో EV మరియు సిట్రస్ EC3 వాహనాలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








