1.25 కోట్ల రూపాయల కారును కొనుగోలు చేసిన ఆలియా భట్.. ఎన్ని ప్రత్యేకతలో..!
బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖుల్లో నటీనటులు ఆలియాభట్, రణ్‌వీర్ కపూర్ దంపతులు ఒకరు. ఈ సంవత్సరం తొలిరోజుల్లో ఓ బేబికి వీరు జన్మనిచ్చారు. ఈ దంపతుల కారు గ్యారేజీలో అనేక ఖరీధైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రణ్‌వీర్ కపూర్ ఇటీవల Range Rover SUVను కొనుగోలు చేశారు. తాజాగా ఆలియా కూడా BMW X7 లగ్జరీ SUVను కొనుగోలు చేశారు.
ఇటీవలే తెలుపు రంగులో ఉన్న బీఎండబ్ల్యూ కారులో ఆలియా కనిపించారు. ఈ వీడియోను కార్ ఫర్ యూ అనే యూట్యూ్బ్ ఛానల్ షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆలియా కొనుగోలు చేసిన BMW X7 లగ్జరీ కారు ప్రస్తుతం మార్కెట్‌లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. XDrive40i M స్పోర్ట్ ధర రూ.1.22 కోట్లు (ఎక్స్‌షోరూం), xDrive40d M స్పోర్ట్ రూ.1.25 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంటుంది.

ఆలియా ప్రయాణించిన BMW X7 కారు డీజిల్ వేరియంట్‌గా తెలుస్తోంది. ఈ కారు భారీ కిడ్నీగ్రిల్‌ను కలిగి ఉంటుంది. మరియు రీడిజైన్ చేయబడిన LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు క్రోమ్ గార్నిష్డ్ ఎయిర్ వెంట్, 3D టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది.
ఇది బీఎండబ్ల్యూ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారణంగా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. BMW X7 డ్యాష్‌బోర్డు డ్యూయల్ స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌గా ఉంటుంది. దీంతోపాటు పనోరమిక్ సన్‌రూఫ్, 14 కలర్ యాంబియంట్ లైటింగ్, డిజిటల్ కీ, ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, మల్టీ జోన్ క్లైమెట్ కంట్రోల్, సీట్ వెంటిలేషన్ ఉన్నాయి.

దీంతోపాటు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్, ప్రయాణికుల సీట్లును కలిగి ఉంటుంది.
బీఎండబ్ల్యూ X7 లగ్జరీ కారు భద్రతా పరంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. మరియు 360 డిగ్రీల కెమెరా, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్. కార్నింగ్ బ్రేక్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ADAS- అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సహా డ్రైవర్ డ్రోసీనెస్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు ఐదు రంగుల్లో లభిస్తుంది. మినరల్ వైట్, ద్రావిట్ గ్రే, కార్బన్ బ్లాక్, టాంజానైట్ బ్లూ షేడ్స్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఇంటీరియర్ టార్టుపో, ఐవరీ వైట్, బ్లాక్ షేడ్ రంగుల్లో ఒకటిని ఎంచుకోవచ్చు. నటి ఆలియా మినరల్ వైట్, టార్టుఫో రంగులను ఎంచుకున్నారు.

BMW x7 కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ ట్విన్ టర్బోఛార్జడ్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 381Ps శక్తి, 520Nm గరిష్ఠ టార్క్‌ను కలిగి ఉంటాయి. డీజిల్ వేరియంట్ 340Ps శక్తి, 700Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








