జర్మన్ బ్రాండ్ కారు కొన్న అలనాటి అందాల తార.. ధర తెలిస్తే షాకవుతారు!

సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారనే విషయం తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు 'కిరణ్ ఖేర్' బెంజ్ కారు కొనుగోలు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కిరణ్ అనుపమ్ ఖేర్ (Kirron Anupam Kher) కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఎస్ ఎస్‌యూవీ. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు అని తెలుస్తోంది. ఇక్కడ కనిపించే జీఎల్ఎస్ కారు 2024 వెర్షన్. కొన్ని నెలల ముందే ఈ కారు మార్కెట్లో ప్రారంభించబడింది.

Kirron Anupam Kher Buys Mercedes Benz GLS

నిజానికి ఈ కొత్త వెర్షన్ దాని పాత వెర్షన్ కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేటెడ్స్ పొందుతుంది. ఇందులో అప్డేటెడ్ గ్రిల్, మధ్య భాగంలో బ్రాండ్ లోగో, నాలుగు హారిజాంటల్ స్లాట్స్ వంటివి గమనించవచ్చు. అయితే నటి కిరణ్ ఖేర్ ఏ వెర్షన్ (పెట్రోల్ లేదా డీజిల్) కొనుగోలు చేసిందనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.

కిరణ్ ఖేర్ కొనుగోలు చేసిన కారు హై-టెక్ సిల్వర్ షేడ్ పొంది ఉండటం చూడవచ్చు. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ ల్యాంప్స్‌లో కొత్త ప్యాటర్న్, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటివి గమనించవచ్చు. ఇది 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. సుమారు 5.2 మీటర్ల పొడవైన ఈ కారు వెడల్పు 1.96 మీటర్లు. ఇంటీరియర్ కూడా చాలా అప్డేట్స్ పొందింది.

2024 మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ వెర్షన్ మూడు ఇంటీరియర్ అపోల్స్ట్రేలను పొందుతుంది. అవి బ్లాక్, బేజ్ లేదా బ్రౌన్ కలర్స్. ఇందులో కస్టమర్ తనకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ ఫాక్స్ లెదర్ పొంది ఉండటం చూడవచ్చు. స్టీరింగ్ వీల్ బటన్లను పొందుతుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, అడ్జస్టబుల్ ఎయిర్ సస్పెన్షన్ మరియు ADAS వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.

జీఎల్ఎస్ కొత్త వెర్షన్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో హీటెడ్ అండ్ కోల్డ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి వాటితో పాటు, 11.6 ఇంచెస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు మరియు సీట్ అడ్జస్టబుల్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. వాహనదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడంలో ఇవి చాలా సహాయపడతాయని తెలుస్తోంది.

Mercedes-Benz GLS

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ వెర్షన్ జీఎల్ఎస్ 450.. ఇది 3.0-లీటర్ 6 సిలిండర్ ఇంజిన్. ఇది 381 పీఎస్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ వెర్షన్ జీఎల్ఎస్ 450డీ.. ఇది 3.0-లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ కలిగి 367 పీఎస్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్స్ రెండూ కూడా మైల్డ్-హైబ్రిడ్ సిస్టం పొందుతాయి. కావున 20 పీఎస్ పవర్ మరియు 200 NM అడిషనల్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజిన్లు 9-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ కారు పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ కారును చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2024, 15:00 [IST]
English summary
Bollywood actress and politician kirron kher buys mercedes benz gls
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+