లగ్జరీ Mercedes Maybach GLS 600 4MATIC లో మెరిసిన దీపికా పదుకొణె.. ఈ కారు ధర తెలిస్తే షాక్ అవుతారు.!!
సినీ సెలబ్రిటీలు మరియు లగ్జరీ కార్లను ఎప్పుడూ వేరు చేసి చూడలేం. ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రముఖ నటీనటులందరి ఇళ్లలో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. మరికొందరి దగ్గర ఐదు, ఆరు చొప్పున ఖరీదైన కార్లలో ఉన్నాయి. తరచూ వాటిలో బయటకు వస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకి కూడా విలాసవంతమైన కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఆమె గ్యారేజీలో Audi Q7, Audi A8L, Mercedes-Benz V-Class ఇంకా Mercedes-Maybach S500 వంటి ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. ఈ నేపథ్యంలో దీపికాకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీపికా ఖరీదైన లగ్జరీ కారులో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. Mercedes-Maybach GLS 600 4MATIC కారులో దీపికా ఎయిర్‌పోర్టు వద్ద హుందాగా దిగింది. అనంతరం అక్కడ ఫొటోగ్రాఫర్లకు దీపికా పోజులిచ్చింది.
భారత మార్కెట్లో మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్‌ఎస్ 600 4మ్యాటిక్ ప్రస్తుత ధర దాదాపు రూ. 3 కోట్లుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధరగా గమనించాలి ఆన్-రోడ్ ధరతో కలుపుకొని దాదాపు ఈ కారు రూ. 3.70 కోట్ల పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కారు లగ్జరీ ఫీచర్లతో పాటు మెరుగైన పనితీరును కలిగి ఉంది.

Mercedes-Maybach GLS 600 4Matic 4.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 6,000- 6,500 rpm వద్ద 550 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 2,500 4,500 rpm వద్ద 730 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కారు క్యాబిన్‌ను చాలా విశాలంగా రూపొందించారు.
ఇది SUV కారు. ఇందులో కేవలం నలుగురు మాత్రమే ప్రయాణించగలరు. నలుగురు ప్రయాణికులు ఈ మెర్సిడెస్ మేబ్యాచ్ GLS 600 4Matic లో చాలా విశాలంగా ప్రయాణించవచ్చు. కస్టమర్లు మెచ్చేలా ఈ లగ్జరీ కారులో అధునాతమైన ఫీచర్లను పొందుపరిచారు. ఈ కారు క్యాబిన్ ఫీచర్లను చూసినట్లయితే మీరు ఫిదా అవ్వకుండా ఉండలేరు.

విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి Mercedes-Maybach GLS 600 4MATIC మంచి ఆప్షన్. అయితే ఈ కారు చాలా ఖరీదైనది.. మినిమమ్ రూ. 4 కోట్లైనా పెడితేనే ఈ కారును సొంతం చేసుకోలేరు. అందుకే ఎక్కువగా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ధనవంతుల వద్ద ఇలాంటి లగ్జరీ కార్లను చూడగలం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








