MG Comet EV చిట్టి కారులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్.. వీడియో వైరల్
MG కామెట్ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ సమయంలోనే చాలా మందిని ఆకట్టుకుంది. అయితే ఈ కారుకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారు ప్రత్యేక డిజైన్, ఫీచర్లు, ధర. ఒక కారణం అయితే ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసిన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరో కారణం. ఈ చిట్టికారును డ్రైవ్ చేయడంపై జాన్వీ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కారు లోపల కూర్చున్నాక జాన్వీ చాలా సంతోషంగా ఉండడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. కారు డిజైన్, ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయని జాన్వీ అన్నారు. మరియు కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థలపైనా జాన్వీ కామెంట్ చేశారు. వాటి పనితీరును పరీక్షించారు. ట్విన్ డిస్‌ప్లే ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.

కారు డిజైన్ కూడా తనను ఆకట్టుకుందని, అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడంపైనా ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఈవీ డిజిటల్ లాక్‌ను టెస్ట్ చేశారు. మొత్తంగా కారు పనితీరు, డిజైన్, ఫీచర్లను ప్రశంసించారు. మరియు సౌకర్యవంతంగా కూడా ఉందని కితాబిచ్చారు.
ఎంజీ కామెట్ ఈవీ మే 2023లో బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. అయితే మే, జూన్ నెల విక్రయాల వివరాలు ఇంకా బయటకు రాలేదు. కారు ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది (ఎక్స్‌షోరూం), ఈ వాహనం మూడు వేరియంట్లతో అందుబాటులో ఉంది. అయితే వేరియంట్లను బట్టి ధర ఉంటుంది.

ఎంజీ కామెట్ బేస్ వేరియంట్ ధర రూ.7.98 లక్షల (ఎక్స్‌షోరూం), ఎంజీ కామెట్ ప్లే వేరియంట్ ధర రూ.9.28 లక్షలు మరియు ఎంజీ కామెట్ ప్లష్ వేరియంట్ ధర రూ.9,98 లక్షలకు అందుబాటులో ఉంది. 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఎంజీ కామెట్ ఈవీలో కేవలం 519 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని సంస్థ చెబుతోంది.
ఎంజీ కామెట్ ఈవీ 2974మిమీ పొడవు, 1505మిమీ వెడల్పు, 1613మిమీ ఎత్తు మరియు 2010మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ కారు ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. క్యాండీ వైట్, స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్ రూఫ్ మరియు యాపిల్ గ్రీన్ విత్ స్టార్రి బ్లాక్ రూఫ్‌ను కలిగి ఉంది.

ఈ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కి.మీ ప్రయాణం చేయగలదని సంస్థ తెలిపింది. 3.3kW ఛార్జర్‌తో సుమారు 7 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 5 గంటల్లో 10-80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ ఈవీ 41.4 bhp శక్తి మరియు 110Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో డ్యూయల్ 10.25 అంగుళాల స్కీన్‌ను కలిగి ఉంటుంది. మాన్యూవల్ AC, ఆపిల్ ఐపాడ్ లాంటి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, డిజిటల్ కీ, ఫ్రంట్ పవర్ విండోస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








