రూ.1.2 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన కరీనా కపూర్..!
ల్యాండ్ రోవర్ SUV ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి. అనేక మంది వ్యాపారవేత్తలు, నటులు ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొనుగోలు చేశారు.
కరీనా కపూర్ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ (kareena kapoor land rover defender SUV) వీడియోను కార్స్ ఫర్ యూ తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. తొలుత కరీనా సోదరి కరిష్మా తొలుత తన తెలుపు రంగు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ SUVలో కరీనా ఇంటికి చేరుకోవడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు.

అనంతరం ఇంటిలోపలి నుంచి కరీనా, కరిష్మా కపూర్‌లు తమ పార్కింగ్ వద్ద వెళ్లడాన్ని చూడవచ్చు. ఈ వీడియోలో కరీనా కపూర్ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను గమనించవచ్చు. ఈ కారు యులాంగ్ తెలుపు రంగును కలిగి ఉంది. కరీనా, కరిష్మాలకు చెందిన రెండు ల్యాండ్ రోవర్ కార్లు పక్కపక్కనే పార్కింగ్ చేయడం గమనించవచ్చు. వాటికి సమీపంలో వారిద్దరూ మాట్లాడుకుంటూ కెమెరా కంటపడ్డారు.
నటి కరీనా కపూర్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వేరియంట్ వివరాలు తెలియలేదు. అయితే ధర మాత్రం రూ.1.2 కోట్లు (ఎక్స్‌షోరూం) డిఫెండర్ 110 వేరియంట్ అని తెలుస్తోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డిఫెండర్ 90, 110, 130 వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్లలో డిఫెండర్ 130 ఇటీవల విడుదల అయింది.

డిఫెండర్ 110, 130 వేరియంట్లు 5 డోర్లను కలిగి ఉంటాయి. ఈ SUVలో 7 ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేలా ఉంటుంది. డిఫెండర్ 90 వేరియంట్ 3 డోర్లను మాత్రమే కలిగి ఉంటుంది. బాబా రామ్‌దేవ్ కూడా డిఫెండర్ 130ను కలిగి ఉన్నారు. ప్రముఖ నటుడు ఫహద్ పాసిల్ కూడా డిఫెండర్ SUVను కొనుగోలు చేశారు.
ల్యాండ్ రోవర్ ప్రస్తుతం వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 2.0 లీటర్ 4 సిలిండర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 300 bhp శక్తి, 400Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 400bhp శక్తి, 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ టర్బో డీజిల్ ఇంజిన్ 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 300bhp శక్తి, 650Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు మరో శక్తివంతమైన ఇంజిన్‌ను ల్యాండ్ రోవర్ డిఫెండర్ అందుబాటులో ఉంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUV : 5.0 లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 518bhp శక్తి, 625Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అన్ని ఇంజిన్లు 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. వెనుక చక్రాలకు శక్తి పంపబడుతుంది.
దేశంలో చాలా మంది సెలబ్రిటీలు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లను కలిగి ఉన్నారు. కరీనాతోపాటు సన్నీడియోల్, సునీల్ శెట్టి, ఆసిఫ్ అలీ, అర్జున్ కపూర్, మమ్ముట్టి, ఆయుష్ శర్మ, రవితేజ, ప్రకాశ్‌రాజ్ నటులు కలిగి ఉన్నారు. వీరితో పాటు ముఖేష్ అంబానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరికొందరు ప్రముఖులు ఈ కార్లను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications








