ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

భరత్ అనే నేనులో మహేష్ బాబు సరసన మరియు వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ సరసన నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి కియారా ఆద్వానీ (Kiara Advani) తాజాగా ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దేశంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఒకటైన ఆడి ఏ8ఎల్ (Audi A8L) ను ఆమె కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

కియారా కార్ కలెక్షన్ లో ఇప్పటికే పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బిఎస్‌డబ్ల్యూ ఎక్స్5 (BMW X5), మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ (Mercedes-Benz E-Class) మరియు బిఎమ్‌డబ్ల్యూ 530డి (BMW 530D) మొదలైనవి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా ఆడి ఏ8ఎల్ లగ్జరీ కారు వచ్చి చేరింది. ఆడి ఇండియా కూడా తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఆడి A8Lతో కియారా అద్వానీ పోజ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసింది.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి గత 2020 సంవత్సరంలో తమ ఏ8ఎల్ లగ్జరీ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకూండా అనేక లగ్జరీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. భారతదేశంలో ఆడి ఎ8ఎల్ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ. 1.56 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. ధరతో విడుదలైంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. భారత మార్కెట్లో ఆడి ఏ8ఎల్ లగ్జరీ సెడాన్ యొక్క లాంగ్ వీల్ బేస్ వెర్షన్ విక్రయించబడుతోంది.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

ఆడి ఏ8ఎల్ లగ్జరీ కారులో 3 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 336 బిహెచ్‌పి పవర్ ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు లోపలి భాగంలో అనేక విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. వీటిలో వెనుక ప్రయాణీకుల పాదాలను మసాజ్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

ఈ లగ్జరీ సెడాన్ చాలా ప్రీమియం డిజైన్ మరియు లుక్ అండ్ ఫీల్ ను కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ముందుభాగంలో ఫ్రంట్ గ్రిల్, సాఫ్ట్ హెచ్‌డి మ్యాట్రిక్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ప్రీమియం లుక్ కోసం అధిక క్రోమ్ భాగాలు ఉంటాయి. ఆడి ఏ8ిఎల్ లగ్జరీ సెడాన్ లో 19 ఇంచ్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. ఇంకా ఇందులో వెనుక ప్యాసింజర్ల వినోదం కోసం ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్ ల వెనుక బాగంలో అమర్చిన రెండు ఆండ్రాయిడ్ టాబ్లెట్లు కూడా ఉంటాయి, వీటిని అవసరమైతే తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

అంతేకాకుండా, ఆడి ఏ8ఎల్ లగ్జరీ సెడాన్ లో యాంబియంట్ లైటింగ్ మరియు కూల్డ్ గ్లవ్ బాక్స్‌, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే మరియు మ్యాట్రిక్స్ ఎల్ఈడి రీడింగ్ లైట్‌లను కూడా కలిగి ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు 3డి వ్యూతో కూడిన 360 డిగ్రీల కెమెరా, లేన్ వార్నింగ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

భారత విపణిలో ఆడి ఏ8ఎల్ లగ్జరీ కారు బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ఫేస్‌లిఫ్ట్, మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, లెక్సస్ ఎల్ఎస్500హెచ్ మరియు ఎక్స్‌జె వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఏ8ఎల్ లగ్జరీ కారు ఆడి బ్రాండ్ లో బాగా ప్రాచుర్యం చెందిన కారు. ఇందులో లభించే విలాసవంతమైన ఫీచర్ల కారణంగా, ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలుదారులు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

ఖరీదైన Audi A8L లగ్జరీ కారును కొనుగోలు చేసిన రామ్ చరణ్ హీరోయిన్..

భారతదేశంలోని చాలా మంది సెలబ్రిటీల వద్ద ఆడి ఏ8ఎల్ లగ్జరీ కార్లు ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖులలో ఒకరైన కరణ్ జోహార్ వద్ద కూడా ఇలాంటి కారు ఉంది. ఈ ఏడాది ఆగస్టులో అతను ఆడి ఏ8ఎల్ లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేశాడు. భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ వద్ద ఇలాంటి ఓ ఆడి కారు ఉన్నట్లు సమాచారం. అయితే విరాట్ కోహ్లీకి ఆ కార్లలో కొన్నింటిని విక్రయించే అలవాటు ఉండటం కూడా గమనించదగ్గ విషయం.

Most Read Articles

English summary
Bollywood actress kiara advani brought audi a8l luxury car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X