రూ.2 కోట్ల BMW i7 లగ్జరీ ఎలక్ట్రిక్‌ సెడాన్‌లో తళుక్కుమన్న బాలీవుడ్‌ నటి.!

బాలీవుడ్‌ నటి కిమ్‌ శర్మ ఇటీవల తన వాహనాన్ని అప్‌గ్రేడ్ చేశారు. గతంలో టాటా నానో కారులో అనేకసార్లు కనిపించిన కిమ్ శర్మ (Bollywood actress kim sharma).. BMW i7 ఎలక్ట్రిక్ సెడాన్‌ ఇటీవల కొనుగోలు చేశారు. ఆ లగ్జరీ సెడాన్‌లో తాజాగా ఓ రెస్టారెంట్‌ వద్ద కెమెరా కంటపడ్డారు. BMW i7 బీఎండబ్ల్యూకు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ సెడాన్‌.

ఈ వీడియోను కార్స్‌ ఫర్‌ యు తమ ఛానల్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నటి కిమ్‌ శర్మను (actress kim sharma New car) కొంత మంది జర్మలిస్ట్‌లు ఫోటోలు కావాలని కోరారు. అనంతరం అక్కడ నుంచి రెస్టారెంట్‌లోకి వెళ్లడం వీడియోలో గమనించవచ్చు.

BMW i7 Electric car specs

ఎలక్ట్రిక్‌ i7 కారు బీఎండబ్ల్యూకు చెందిన ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌. ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. డైమండ్‌ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు లోపలి భాగం కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. 14.9 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, మరో రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. iDrive 8 అపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తుంది.

BMW i7 ఎలక్ట్రిక్‌ కారు రెండు మోటార్లను కలిగి ఉంటుంది. ఒక్కో యాక్సిల్‌పై ఒక్కో మోటార్‌ ఉంటుంది. ఇది 544bhp శక్తి, 745Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 101.7kWh లిథియం అయాన్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 591 కి.మీ నుంచి 625 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.

kim sharma BMW i7 Electric car

ఈ లగ్జరీ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ధర రూ.1.95 కోట్లుగా (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు రూఫ్‌పై 31.3 అంగుళాల 8K నాణ్యత కలిగిన స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను నియంత్రించేందుకు 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌, క్రైమేట్‌ కంట్రోల్‌ సహా ఇతర ఫీచర్లు ఉంటాయి.

బాలీవుడ్‌ నటి కిమ్‌ శర్మ బీఎండబ్ల్యూ i7 ఎలక్ట్రిక్‌ సెడాన్‌తో సహా టాటా నానో కారును కూడా కలిగి ఉన్నారు. గతంలో అనేకసార్లు టాటా నానోలో కనిపించారు. టాటా నానో 624cc ట్విన్ సిలిండర్‌ ఇంజిన్‌తో వచ్చింది. ఇంజిన్‌ 37bhp శక్తి, 51Nm టార్క్‌ను ఉత్పత్తి చేసింది. అయితే నానో కార్లలో వెనుక సీట్ల వెనుక ఇంజిన్‌ ఉంటుంది. ఇటువంటి కార్లు భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో చాలా అరుదుగా ఉంటాయి.

Bollywood actress kim sharma latest news

బాలీవుడ్‌ నటీనటులు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. సుమారుగా అందరు నటులు కూడా కోట్లాది రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లను తమ గ్యారేజీల్లో కలిగి ఉన్నారు. చాలా సందర్భాల్లో వాటిలో ప్రయాణం చేస్తూ కెమెరా కంటపడతారు. బీఎండబ్ల్యూ, రేంజ్‌ రోవర్‌ వంటి అనేక కార్లను కలిగి ఉన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, October 16, 2023, 19:07 [IST]
English summary
Bollywood actress kim sharma spotted new bmw i7 electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+