బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో సైతం ఎక్కువ అదరణపొందుతున్న టూ వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్. ఇందులో కూడా కంపెనీ యొక్క క్లాసిక్ 350 బైక్ విపరీతమైన డిమాండ్ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. ఈ బైక్ కేవలం సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రెటీలను సైతం ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది.

ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ కొత్త బైక్ కొనుగోలు చేసినట్లు మనం ఇప్పటికే తెలుసుకున్నాం. అయితే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి కూడా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి 2010 లో ఖిచ్డీ: ది మూవీలో తొలిసారిగా నటించింది. తరువాత కాలంలో ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ మరియు మిషన్ మంగళ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు కొత్త కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొనుగోలు చేసి మరో సరి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలువడ్డాయి.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

ఇందులో నటి ఇప్పటి వరకు ఇదే తన తొలి మోటార్‌సైకిల్ అని, హెలికాన్ గ్రే కలర్ థీమ్‌లో మోడల్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది, ఇది నిజంగా నాకు ప్రత్యేకమైన క్షణం ఎందుకంటే నేను ఎప్పుడూ బైక్‌ను కలిగి ఉండే వ్యక్తిగా లేదా #బైకర్ అని పిలవబడే వ్యక్తిగా ఎప్పుడూ చూడలేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త క్లాసిక్ బైక్ కొన్నాను, అని తెలిపింది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 దేశీయ ద్విచక్ర వాహన బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1.87 లక్షల నుండి రూ. 2.18 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై) అరకు ఉటుంది. కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని విడుదల చేసింది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

కొత్త క్లాసిక్ 350 బైక్ కంపెనీ యొక్క కొత్త J-ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడింది. మోటార్‌సైకిల్ పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కనిపించే ఆధునిక క్లాసిక్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. దీని పాత తరం మోడల్ 12 సంవత్సరాల క్రితం భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ మోటార్‌సైకిల్ ఐదు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇది 11 విభిన్న కలర్ ఆప్సన్ లో అందుబటులో ఉంటుంది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్‌ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్‌ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్‌ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

కొత్త Classic 350 బైక్‌ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిఙ్గి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

బాలీవుడ్ భామ మనసు దోచిన కొత్త బైక్.. ఇదే.. మీరూ చూడండి

ఈ కొత్త బైక్ లో ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ దాని పాత సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ స్థానంలో ఉపయోగించబడింది. కావున దీని బరువు 195 కిలోల వరకు ఉంటుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు ఎక్కువ వైబ్రేషన్ అనిపించదు, తద్వారా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Most Read Articles

English summary
Bollywood actress kirti kulhari buys new royal enfield classic 350 bike details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X