'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు.. మీరు చూసారా..!!

హిందీ సినిమాల్లో మరియు అమెరికన్ టెలివిజన్‌లో బాగా పాపులర్ అయిన ప్రముఖ భారతీయ నటి 'నిమ్రత్ కౌర్' (Nimrat Kaur) ఇటీవల ఒక కొత్త SUV ని కొనుగోలు చేసింది. దీనికి సంబందించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంతకీ నటి 'నిమ్రత్ కౌర్' ఏ కారు కొనుగోలు చేసింది, దీని ధర ఏమిటి మరియు ఇతర వివరాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

నిమ్రత్ కౌర్ కొనుగోలు చేసిన ఆ కొత్త కారు 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్ఈ' అని తెలుస్తోంది. ఇది కంపెనీ యొక్క ఐదవ జనరేషన్ మోడల్, ఇది భారతీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైంది. కావున బహుశా ఈ ఆధునిక SUV కొనుగోలు చేసిన భారతీయ నటి ఈమే అయి ఉంటుంది. ఈ SUV కి నిమ్రత్ కౌర్ 'బ్లాక్ బీస్ట్' అని పేరు పెట్టింది.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

నిమ్రత్ కౌర్ తన కొత్త 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్ఈ' SUV లో కనిపించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో కారు డ్రైవర్ తనని నేరుగా స్టూడియో ప్రాంగణంలోకి తీసుకువెళతాడు, అప్పుడు ఆ కారులో నుంచి ఆ నటి దిగటం కూడా చూడవచ్చు. ఆ పైన ఫోటోలకు ఫోజులివ్వడం కూడా ఆ వీడియోలో చూడవచ్చు.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

ఇక నటి కొనుగోలు చేసిన కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ విషయానికి వస్తే, ఇది ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ SUV యొక్క ముందు భాగంలో సిగ్నేచర్ రేంజ్ రోవర్ గ్రిల్ దాని ముందు భాగంలో అమర్చబడింది. ఇది హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో సులభంగా కలిసిపోయే విధంగా రూపొందించబడింది. హెడ్‌ల్యాంప్‌లలో ప్రొజెక్టర్ ఎల్ఈడీ లైట్లు మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ అమర్చబడి ఉన్నాయి.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

ఇందులోని బంపర్ రీడిజైన్ చేయబడింది, కావున ఇది చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్‌కి విషయానికి వస్తే, ఇది ఐకానిక్ సిల్హౌట్‌ కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాకుండా డోర్ హ్యాండిల్స్ కూడా మార్చబడ్డాయి. ఇందులో గమనించదగ్గ అతి పెద్ద మార్పు, దాని రియర్ ప్రొఫైల్, ఇక్కడ టెయిల్ గేట్‌పై గ్లోస్ బ్లాక్ ప్యానెల్ ఉంది. దీనిపైన బ్రాండ్ యొక్క బ్యాడ్జ్ చూడవచ్చు. అంతే కాకుండా నిలువగా ఉన్న ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ కూడా ఉంది. ఇక్కడ కనిపించే కొత్త రేంజ్ రోవర్ బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

ఇక ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. స్టాండర్డ్ రేంజ్ రోవర్ కార్లలో మాదిరిగానే క్యాబిన్ చాలా విలాసవంతంగా ఉంటుంది, కానీ డిజైన్ కొత్త రేంజ్ రోవర్ మోడల్‌ను పోలి ఉంటుంది. క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డోర్లపైన మరియు లోపల చాలా భాగం బేజ్ కలర్ ఉంది. ఇది కారుని మరింత ప్రీమియంగా చూపిస్తుంది. ఇందులో 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పూర్తిగా డిజిటల్ యూనిట్.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

వీటితోపాటు ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ మొదలైనవి ఉన్నాయి. మొదటి సారి, రేంజ్ రోవర్ మూడవ వరుస సీటుతో అందించబడుతోంది. ఇది ఎల్డబ్ల్యుబి వేరియంట్‌లో మాత్రమే అందించబడుతుంది.

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

కొత్త రేంజ్ రోవర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించబడుతోంది. ఇందులో 4.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 520 బిహెచ్‌పి పవర్‌ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 343 బిహెచ్‌పి పవర్‌ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర రూ. 2.32 కోట్లు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 3.41 కోట్ల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

'నిమ్రత్ కౌర్' కొనుగోలు చేసిన కొత్త కారు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ది లంచ్‌బాక్స్, ఎయిర్‌లిఫ్ట్ మరియు దస్వి వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిన నిమ్రత్ కౌర్ యొక్క గ్యారేజ్ లో ఇప్పుడు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్ఈ కొనుగోలు చేసింది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2022, 8:00 [IST]
English summary
Bollywood actress nimrat kaur buys new range rover suv features price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+