BMW iX SUVలో ఎయిర్‌పోర్టుకు బాలీవుడ్‌ నటి.. వైరల్‌ అవుతున్న ఫన్నీ సంఘటన..!

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు లగ్జరీ వాహనాలు అంటే చాలా ఇష్టం. వారిలో అనేక మంది నటీనటులు ఈ లగ్జరీ కార్లలో తళుక్కుమంటూ ఉంటారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టులు సహా ఇతర ఈవెంట్లలో ఈ లగ్జరీ కార్లతో సందడి చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి నుష్రత్‌ భరుచ్చా తన కుటుంబంలో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. నుష్రత్ కొత్తగా కొనుగోలు చేసిన BMW iX SUVలో కనిపించారు. ఈ సందర్భంగా ఫన్నీ సంఘటన జరిగింది.

BMW iX SUVలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నటి నుష్రత్.. కారులో ఉన్న తన సామాన్లను కలెక్ట్‌ చేసుకొనేందుకు వెనుక లగేజ్‌ కంపార్ట్‌మెంట్‌ను తెరిచారు. అనంతరం దానిని మూసివేసేందుకు ప్రయత్నం చేస్తారు. అంతలో కారు ముందుకు కదులుతుంది. దీంతో లగేజ్‌ కంపార్ట్‌మెంట్‌ను సరిగా మూసివేసేందుకు అవకాశం ఉండదు.

actress nushrat bharucha bmw ix SUV boot door video

మరోసారి మూసివేసేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాదు. దీంతో అక్కడ కాసేపు ఫన్నీ వాతావరణం నెలకొంది. అయితే బోర్డింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారికి నవ్వు తెప్పించింది. బూట్‌ డోర్‌ను సరిగ్గా మూసివేయకపోవడానికి అక్కడ బ్యాగ్‌ ప్రధాన అడ్డంకిగా ఉంది. నుష్రత్‌ దానిని సరిగా గమనించలేదు.

బాలీవుడ్‌ నటి నుష్రత్‌ కనిపించిన BMW iX కారు ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌తో డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 76.6kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ మూడు రకాల ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. 11kW ఛార్జర్‌, 50kW DC ఛార్జర్‌, 150kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌ను సపోర్టు చేస్తుంది.

actress nushrat bharucha bmw ix SUV boot door video

150kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌ను ఉపయోగించి ఈ కారు బ్యాటరీని 0-80 శాతం ఛార్జింగ్‌ చేసేందుకు 31 నిమిషాల సమయం పడుతుంది. అదే 50kW DC ఛార్జర్‌తో 73 నిమిషాల సమయం పడుతుంది. అదే గృహ విద్యుత్ కనెక్షన్‌తో ఛార్జింగ్‌ చేసేందుకు 7 గంటల సమయం పడుతుంది. ఈ కారు బ్యాటరీ సింగిల్‌ ఛార్జింగ్‌తో 425 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

BMW సంస్థ కొత్త CLAR ప్లాట్‌ఫాం కింద iX మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఆ కారు అల్యూమినియం, కార్బన్‌ ఫైబర్ భాగాలను కలిగి ఉంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.1.21 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు ఇంటీరియర్‌ 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 12.3 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తుంది.

actress nushrat bharucha bmw ix SUV boot door video

దీంతోపాటు BMW iX ఎలక్ట్రిక్‌ SUV 4 జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, వైర్‌సెల్ ఫోన్‌ ఛార్జర్‌, మసాజింగ్‌ సీట్లు, పనోరమిక్‌ గ్లాస్‌ సన్‌రూఫ్‌ సహా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, September 16, 2023, 11:04 [IST]
English summary
Bollywood actress nushrat bharucha struggle to close bmw ix suv boot door
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+