సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

సినిమాలో నటిగా, టెలివిజన్ షోలో హోస్ట్‌గా, ఐటమ్ సాంగ్స్‌లో బెస్ట్ డాన్సర్‌గా మరియు రాజకీయ నాయకురాలిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంట్రావర్సీ క్వీన్ రాఖీ సావంత్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే, ఈసారి మాత్రం కాంట్రావర్సీతో కాదులెండి. ఎప్పుడు ఓ పాత మారుతి కారులో తిరిగే ఈమెకు, తన స్నేహితులు ఓ ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారుని బహుమతిగా ఇచ్చారట. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

రాఖీ సావంత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమెతో పాటుగా ఆమె స్నేహితురాలు షెల్లీ లాథర్ మరియు రాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వారిద్దరూ తనకు ఈ కారును బహుకరించారని రాఖీ సావంత్ తన పోస్ట్ లో తెలిపారు. ఇందులో రెడ్ కలర్ లో కనిపించే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కారును చూడవచ్చు. రాఖీ సావంత్ తన ఐటెం సాంగ్ (తెరీ డ్రీమ్ మే మేరీ ఎంట్రీ) ని ముంబై నగరంలో ప్రమోట్ చేసే సమయంలో ఓ రెడ్ కలర్ మారుతి బాలెనో కారులో తిరుగుతూ కనిపిస్తారు.

సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

కాగా, ఇప్పుడు ఆమెకు అదే రెడ్ కలర్ లో ఉండే బిఎమ్‌డబ్ల్యూ (BMW X1) కానుకగా లభించింది. రాఖీ సావంత్ గొప్ప నర్తకి. కొన్ని టీవీ షోలలో కూడా ఆమె తనదైన ముద్ర వేశారు. రాఖీ కా స్వయంవర్ పేరుతో వచ్చిన ఓ రియాల్టీ షో ద్వారా ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఆ సమయంలో ఆ షోలో గెలిచిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ అదంతా పబ్లిసిటీ మరియు టిఆర్‌పి స్టంట్ కావడంతో ఆ తర్వాత ఆమె చాలా చిక్కులను కూడా ఎదుర్కున్నారు. రాఖీ ఎప్పుడూ వివాదాల్లో ఉన్నప్పటికీ, ఆమెకు స్నేహితుల అండ మాత్రం ఎప్పుడూ ఉంటుంది.

సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

ఈ క్రమంలోనే రాఖీ సావంత్ స్నేహితులు ఆమెకు ఈ ఖరీదైన కారును కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తెలుగులో 6 టీన్స్ అనే సినిమాలో కూడా రాఖీ సావంత్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు. సినిమా రంగంలో అవకాశాల గురించి స్పందించిన రాఖీ సావంత్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కాంట్రవర్సీ క్వీన్ గా వార్తల్లో నిలిచిన రాఖీ సావంత్ తన సినీ ప్రయాణం అంత సులువైనదేమీ కాదని వెల్లడించారు. తాను ఈ పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడ్డానని, ఇప్పటికీ తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసేవారు.

సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

రాఖీ సావంత్‌కు తన స్నేహితులు గిఫ్ట్ గా అందించిన BMW X1 కారు విలువ సుమారు రూ.40 లక్షలకు పైగానే ఉంటుంది. ఆమె అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఒకరైన షెల్లీ లాథర్ ఆమెకు ఈ అందమైన కారును బహుమతిగా ఇచ్చారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఆదిల్ ఖాన్ దుర్రానీ మరియు లాథర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. అలాగే, ఈ డ్రామా క్వీన్ తన కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ క్లిప్‌ను కూడా నెటిజన్లతో పంచుకుంది. తాను ఇతర స్టార్ నటీనటుల (సల్మాన్ ఖాన్) మాదిరిగా ఖరీదైన కార్లను కొనుగోలు చేయలేనని రాఖీ స్టేట్‌మెంట్ చేసిన తర్వాత ఆమెకు ఈ కారు గిఫ్ట్ గా లభించింది.

సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

రాఖీ సావంత్ ఓ ఖరీదైన కార్ షోరూమ్‌లో కనిపించగా, అక్కడ కొందరు ఆమెను ఏం మేడమ్ కారును కొనడానికి వచ్చారా అని అడిగితే, తనకు సల్మాన్ ఖాన్ లాగా ఖరీదైన కార్లను కొనేంత శక్తి లేదని కాంట్రావర్సీ చేసింది. బహుశా ఈ స్టేట్‌మెంట్ తర్వాత ఆమె ఫ్రెండ్ లాథర్, రాఖీకి ఈ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చి ఉండొచ్చేమోనని తెలుస్తోంది. రాఖీ ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇలా రాసింది.. నా స్వీట్ హార్ట్ షెల్లీలాథర్ మరియు రాజ్ భయ్యా బహుమతిగా ఇచ్చిన నా కొత్త కారు.. మీ పట్ల నాకు ఎప్పుడూ ప్రేమ మరియు గౌరవం ఉంటుంది. ధన్యవాదాలు.

ఈ మాజీ బిగ్ బాస్ స్టార్‌ ఇటీవల ముంబైలో జరిగిన RRR సక్సెస్ పార్టీలో కూడా పాల్గొంది. ఆ సమయంలో ఆమె రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లకు అభినందనలు తెలియజేసింది. ఆ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు తనతో డ్యాన్స్ చేయమని కూడా రామ్ చరణ్ ని కోరింది. అయితే, వారంతా భారీ జనసందోహంలో ఉండటంతో, ఇప్పుడు కాదని అతను మర్యాదపూర్వకంగా చెప్పాడు. ఆ సమయంలో కరణ్ జోహార్ మరియు అయాన్ ముఖర్జీ లతో కలిసి దిగిన ఫొటోలను కూడా రాఖీ షేర్ చేసింది.

సల్మాన్ లాగా ఖరీదైన కార్లను కొనలేన్న రాఖీ..! ఆ వెంటనే ఫ్రెండ్స్ నుండి ఖరీదైన కారు గిఫ్ట్..!!

బిఎమ్డబ్ల్యూ అందిస్తున్న ఈ ఎక్స్1 ఎస్‌యూవీలో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 192 పిఎస్ శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ నుండి వచ్చే శక్తి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ సాయంతో ముందు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ISOFIX చైల్డ్-సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 15, 2022, 18:13 [IST]
English summary
Bollywood actress rakhi sawant gets bmw x1 luxury car as gift from friends
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+