ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే లగ్జరీ కార్లలో ఆడి క్యూ7 కూడా ఒకటి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షానాయ కపూర్ ఈ ఆడి క్యూ7ను కొనుగోలు చేశారు. నలుపు రంగులో నిగనిగలాడే ఆడి క్యూ7 ఎస్‌యూవీని షానాయ కపూర్ కొనుగోలు చేశారు. ఈ బాలీవుడ్ సెలబ్రిటీ కోసం ఆడి షోరూమ్ యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. కారు డెలివరీ సమయంలో ఆమె చిత్రంతో కూడిన పోస్టర్ ను కారు ప్రక్కనే ఉంచారు. ఆ పోస్టర్ పై.. అభినందనలు! ఆడి కుటుంబంలోకి స్వాగతం అని పోస్ట్ చేశారు.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

ఆడి క్యూ7 డెలివరీ తీసుకుంటున్న చిత్రాలను షానాయ కపూర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సరికొత్త ఆడి క్యూ7 యొక్క ముందు భాగంలో రిజిస్ట్రేషన్ ప్లేట్ పై "షానాయ కపూర్" అనే పేరు కూడా ముంద్రించబడి ఉంటుంది. అయితే, ఇది తాత్కాలికమే అనుకోండి, ఇంటికి వెళ్లాక ఆమె దీనిని తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో మార్చుకోవాల్సి ఉంటుంది. షానాయ కపూర్ త్వరలోనే సినిమాల్లోకి రాబోతోంది, ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా వస్తున్న బేహదక్ అనే చిత్రంలో ఆమె కనిపించబోతోంది.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

షానాయ కపూర్ తన తొలి చిత్రం కంటే ముందే తన మొదటి కారును కొనుగోలు చేసింది. ఈ సరికొత్త ఆడి క్యూ7 నలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఆడి క్యూ7 రూ. 79.99 లక్షల నుండి రూ. 88.33 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉంటాయి. కస్టమర్లు ఎంచుకునే వేరియంట్ మరియు కారు లోపల లేదా వెలుపల చేసుకునే అదనపు కస్టమైజేషన్స్ కారణంగా ధరలు మారుతూ ఉంటాయి. కాగా, షానాయ కపూర్ ఈ కారులో ఏ వేరియంట్‌ని ఎంచుకుందనే విషయం ఇంకా తెలియదు.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా (Audi India) గత నెలలో తమ సరికొత్త 2022 మోడల్ ఆడి క్యూ7 (2025 Audi Q7) ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్యూ7 ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో తీసుకురాబడింది, దీనిలో ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే వేరియంట్లు ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 5 లక్షల అడ్వాన్స్ మొత్తం చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త 2022 ఆడి క్యూ7 రిఫ్రెష్డ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో తీసుకురాబడింది. అలాగే, ఇందులో మేజర్ ఫీచర్ అప్‌గ్రేడ్స్ కూడా చేయబడ్డాయి.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

ఇంజన్ విషయానికి వస్తే, ఆడి క్యూ7లో కంపెనీ పవర్‌ఫుల్ 2,995 సిసి వి6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ని ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పిల పవర్ ను మరియు గరిష్టంగా 500 ఎన్ఎమ్‌ ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ను కూడా కలిగి ఉంది. ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిలమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు మరియు కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకోగలదు.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

ఆడి క్యూ7 ఎస్‌యూవీ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది ఇటు ఆన్-రోడ్ మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిడ్యువల్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇక ఇందులో కొత్తగా జోడించిన ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో వెనుక వైపు ప్యాసింజర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ సైడ్ మిర్రర్లు, అప్‌డేట్ చేయబడిన టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

అంతేకాకుండా, ఇందులో క్యాబిన్ మూడ్ లైటింగ్, 12 రకాలు సర్దుబాటు చేయగల పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌తో సహా మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఈ కొత్త మోడల్‌కు జోడించబడిన సేఫ్టీ ఫీచర్లలో వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా లభిస్తాయి. ఇవి కాకుండా, ఇందులో మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీటెడ్ అండ్ పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ ఫీచర్లు కూడా స్టాండర్డ్ గా లభిస్తాయి.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

ఆడి క్యూ7 పేరుకు తగినట్లుగానే ఒక 7-సీటర్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ. ఈ 7-సీటర్ మోడల్ లోని మూడవ వరుసలో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్‌తో పాటుగా డ్యూయెల్ జోన్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ బూట్ లిడ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి. కంపెనీ ఈ కారులో మై ఆడి కనెక్ట్ (My Audi Connect) అనే కనెక్టివిటీ సిస్టమ్ ను కూడా అందిస్తుంది. ఇది వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రోడక్ట్ విజువలైజర్ వంటి అత్యాదునిక ఫీచర్లతో వస్తుంది.

ఆడి క్యూ7 లగ్జరీ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ షానాయ కపూర్!

కొలతల పరంగా చూస్తే, కొత్త 2022 ఆడి క్యూ7 ఎస్‌యూవీ పొడవు 5,063 మిమీ, వెడల్పు 1,970 మిమీ మరియు ఎత్తు 1,741 మిమీగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 2,995 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది మరియు ఇందులో 865 లీటర్ల భారీ బూట్‌స్పేస్‌ కూడా లభిస్తుంది. కావాలనుకుంటే, వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా ఈ బూట్ స్పేస్ ను 2,050 లీటర్ల వరకు విస్తరించవచ్చు. కంపెనీ ఈ కారుపై 7 సంవత్సరాల వరకు పొడిగించబడిన వారంటీతో పాటుగా 2-సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని మరియు 5 సంవత్సరాల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తుంది. అవసరం అనుకుంటే, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ను 10 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.

Article Published On: Wednesday, March 23, 2022, 10:36 [IST]
English summary
Bollywood actress shanaya kapoor buys audi q7 luxury suv details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+