రూ. 5 కోట్ల ఖరీదైన క్రోమ్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్‌లో మెరిసిన శిల్పా శెట్టి.. ఈ కారుకు ఇంత ధర ఎందుకు.??
భారత్‌లో సినీ సెలబ్రిటీలకు లగ్జరీ కార్లన్నా, బైక్‌లన్నా చాలా మోజు. అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ముచ్చట తీర్చుకుంటారు. కొన్ని విదేశీ కార్లు భారత్‌లో విక్రయిస్తున్నా.. ఇక్కడ అందుబాటులో లేని కార్లను లక్షలు ఖర్చు పెట్టి మరీ తెప్పించుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి లగ్జరీ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కారులో తళుక్కుమంది.
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో శిల్పా శెట్టి ఒకరు. శిల్పాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అందుకే గత కొన్నేళ్లలో ఆమె అనేక ఖరీదైన లగ్జరీ కార్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల శిల్పా శెట్టి.. ఖరీదైన బెంట్లీ ఫ్లయింగ్ స్పర్(Bentley Flying Spur) కారులో బయటకు వచ్చింది. ఫ్లాషీ క్రోమ్ కలర్‌లో ఉన్న ఈ కారులో శిల్పా ఓ ఈవెంట్‌కు హాజరైంది.

ఈ వీడియోను కార్స్ ఫర్ యు యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. శిల్పా ఇటీవల ఓ సంస్థ వేడుకలో భాగంగా తన క్రోమ్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్‌లో వచ్చింది. ఏప్రిల్‌లో శిల్పా ఈ కారును డెలివరీని తీసుకుంది. అయితే ఆమె ఈ కారును కొత్తగా కొనుగోలు చేసినప్పుడు అది వైట్ కలర్‌లో ఉంది. ఆఫ్టర్ మార్కెట్ ద్వారా ఈ స్పర్‌ను క్రోమ్ ర్యాప్‌తో ఫినిష్ చేయించింది.
గతంలో శిల్పా తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి డిన్నర్ డేట్ సమయంలో ఈ క్రోమ్ ఫినిషింగ్ బెంట్లీలో వచ్చింది. అయితే అప్పుడు విజువల్స్ అంత స్పష్టంగా కనిపించలేదు. శిల్పా శెట్టి కొనుగోలు చేసిన బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కారుకు క్రోమ్ ర్యాప్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే దీంతో ఫినిష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గీతలు పడే అవకాశం ఉంది.

సాధారణంగా క్రోమ్ ర్యాప్‌లు స్టాండర్డ్ ర్యాప్ రంగుల కంటే ఖరీదైనవి కూడాను. ఇక బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కారు విషయానికొస్తే, ఇది మునుపటి తరం వెర్షన్. భారీ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 500 PS పవర్ వద్ద 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా శిల్పా శెట్టి వినియోగిస్తున్న లగ్జరీ సెడాన్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కారు ధర రూ. 5 కోట్లు పైనే ఉన్నట్లు సమాచారం. వేరియంట్లను బట్టి ఈ కారు ధర మారుతూ ఉంటుంది.

ఈ బ్రిటిష్ లగ్జరీ సెడాన్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కాకుండా, శిల్పా గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. తన భర్త రాజ్ కుంద్రా కార్లతో పాటు ఆమె గ్యారేజీలో బెంట్లీ కాంటినెంటల్ GT, కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ మేబ్యాచ్ GLS600, మెర్సిడెస్ బెంజ్ G63 AMG, BMW X5, BMW 7-సిరీస్, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్-బెంజ్ V-Class వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
అంతే కాకుండా వీరి వద్ద లంబోర్ఘిని అవెంటడోర్, లంబోర్ఘిని గల్లార్డో, BMW i8, పోర్షే కయెన్ GTS స్పోర్ట్స్ SUV వంటి కొన్ని స్పోర్ట్స్ కార్లను కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ లగ్జరీ కార్లు సెలబ్రిటీలకు మరింత హుందాతనాన్ని ఇస్తాయి. అందుకే సినీ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు, ఇంకా అంబానీ లాంటి బిలియనీర్ల గ్యారేజ్‌లో ఇలాంటి లగ్జరీ కార్లు చాలా సాధారణం.


Click it and Unblock the Notifications








